Vilayath Buddha: మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కి ప్రమాదం.. షూటింగ్ కి 3 నెలల గ్యాప్?

మలయాళ స్టార్ పృత్వి రాజ్ కి ఆక్సిడెంట్ అయ్యింది. ఆయన హీరోగా “విలయత్ బుద్ధ” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ కేరళలోని మరయుర్ అనే ఊరులో జరుగుతుంది. గత కొన్ని రోజులుగా శరవేగంగా జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ షూటింగ్ లో అనుకోకుండా హీరో పృథ్వీ రాజ్ కి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన చేతికి, కాలికి చిన్న గాయమైంది. ఈ ఘటన ఆదివారం జరిగింది.

అయితే వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ కొచ్చి లోని ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. అక్కడ ట్రీట్ మెంట్ చేసిన వైద్యులు అభిమానులను కంగారు పడొద్దని ప్రాణాపాయం లాంటి గాయం ఏమి జరగలేదని చెప్పారు. అయితే కాలికి మాత్రం ఒక మైనర్ సర్జరీ అవసరమైందని అన్నారు. ఇక ఆ సర్జరీ ఈరోజు చేస్తునట్టు వైద్యులు వెల్లడించారు. అయితే సర్జరీ అయిన తర్వాత హీరో పృథ్వీ రాజ్ 2 నెలల పాటు షూటింగ్ లకు గ్యాప్ ఇవ్వాల్సిందిగా డాక్టర్లు చెప్పారు.

ఈ ప్రమాదం వల్ల పృథ్వీరాజ్ నటిస్తున్న అన్ని సినిమాల షూటింగ్ లకు బ్రేక్ పడినట్టే అని చెప్పవచు. ముఖ్యంగా ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా “సలార్” కి పెద్ద దెబ్బే. ఈ సినిమాలో ప్రధాన విలన్ గా పృథ్వీరాజ్ నటిస్తున్నాడని తెలిసిందే. మరి రెండు నెలల పాటు షూటింగ్ కు గ్యాప్ అంటే సలార్ షూటింగ్ కి బ్రేక్ పడినట్టే. ఈ సినిమాలో పృథ్వీ రాజ్ పార్ట్ షూట్ ఇంకెంత ఉందొ కూడా తెలియదు. ఇంకా చిత్ర యూనిట్ నుండి కూడా ఈ విషయంపై ఎలాంటి రెస్పాన్స్ కూడా రాలేదు. మరి పృథ్వీ తొందరగా కోలుకోని షూటింగ్ లో అడుగుపెడతాడా లేదా? అన్నది తెలియాలి. దీనిపై క్లారిటీ రావాలంటే హీరో పృథ్వీరాజ్ గాయం తగ్గే దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు