Sreelela: నితిన్ కొత్త సినిమాకి అదిరిపోయే టైటిల్ – ఏంటో తెలుసా.. ?

టాలీవుడ్ లో హిట్లతో ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ పోయే హీరోల్లో నితిన్ కూడా ఒకడు. ఈ యంగ్ హీరో కెరీర్ లో హిట్స్ ఎన్ని ఉన్నాయో ఫ్లాప్ లు కూడా అంతే ఉన్నాయి.

టాలీవుడ్ సాధారణంగా హిట్ వస్తే రేంజ్ పెరగటం, రెమ్యునరేషన్ పెంచడం లాంటివి జరుగుతుంటాయి. అదే విధంగా ఫ్లాప్ వచ్చిన కూడా యంగ్ హీరోలకు మళ్ళీ సినిమా పట్టుకోవడం కష్టమే అవుతుంది. కానీ నితిన్ మాత్రం వీటన్నిటికీ అతీతం అని చెప్పాలి. ఇటీవలనే నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజక వర్గం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన కూడా నితిన్ ఎప్పటిలాగే వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ఇక విషయానికొస్తే ప్రముఖ రైటర్ వక్కంతం వంశి దర్శకత్వంలో నితిన్ ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కి “ఎక్సట్రార్డినరీ మ్యాన్” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు టాక్.

- Advertisement -

హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాలో నితిన్ కు జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. జివి ప్రకాష్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get the latest Tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు