Bhola shankar pre release event: చిరంజీవిని ఏమైనా అంటే వాళ్ళకి జైలే గతి – అల్లు అరవింద్

Bhola shankar pre release event

అందరు చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగితే.. తాను మాత్రం చిరంజీవితో సినిమాలు చేస్తూ పెరిగానంటూ భోళా శంకర్ ప్రి రిలీజ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

మెహర్ రమేష్ దర్శకత్వంలో, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోళా శంకర్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం ఘనంగా జరిగింది. ఇక ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన అల్లు అరవింద్ ఎప్పటిలాగే షార్ట్ అండ్ స్వీట్ గా ఆయన స్పీచ్ ను ముంగించాడు. అయితే ఆయన మాట్లాడింది తక్కువే అయినప్పటికీ మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ లకు మధ్య వస్తోన్న విభేదాలన్నిటికి చెక్ పెడుతూ, చాలా మంది నోళ్లు మూయించేలా అన్ని విషయాలకు క్లారిటీ ఇచ్చాడు. అలాగే జీవితరాజశేఖర్ దంపతులకు గట్టి చురకలు అంటించాడు.

ఇటీవలనే జీవితరాజశేఖర్ దంపతులు 12 ఏళ్ళ క్రితం చిరంజీవి బ్లడ్ బ్యాంకు పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కోర్ట్ తీర్పు ప్రకటిస్తూ సంవత్సరం పాటు ఈ ఇద్దరు దంపతులు జైలుకు వెళ్ళాల్సింది గా తీర్మానించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేస్ వేసింది, జీవితరాజశేఖర్ దంపతులు జైలుకు వెళ్లేలా చేసింది అల్లు అరవిందే.

- Advertisement -

కాగా ఇదే విషయాన్ని ఆయన స్టేజ్ పైన అభిమానులకు గుర్తు చేస్తూ, “చిరంజీవి ని ఏమైనా అంటే వాళ్ళను జైలుకు పంపించేదాకా వదలలేదు. నాకు చిరంజీవి అంటే అంత అభిమానం. అది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకెప్పుడూ లేదంటూ” ఆయన మాట్లాడారు. అయితే ఎక్కువ సమయం లేకపోవడం వల్ల ఆయన స్టేజ్ పైన తక్కువగా మాట్లాడిన.. అన్నీ విషయాలకు క్లారిటీ ఇవ్వడంతో అల్లు అరవింద్ స్పీచ్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు