Shraddha Kapoor comments: ఆ కోరిక మిగిలిపోయింది

Shraddha Kapoor comments viral

ప్రభాస్ తో సాహో సినిమాలో నటించిన శ్రద్ధ కపూర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. బాలీవుడ్ లో మంచి క్రేజ్ తో బడా సినిమాలలో నటించే శ్రద్ధ కపూర్ ఇటీవలనే ఆమె మనసులో మాటను బయట పెట్టింది. ఇటీవలనే ఒక ఈవెంట్ లో పాల్గొన్న శ్రద్ధ కపూర్ తనకు ఒకరి బయోపిక్ లో నటించే కోరిక మిగిలిపోయిందటు ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఒకప్పుడు ఇండియన్ సినిమాను రిప్రెజెంట్ చేసిన బాలీవుడ్ గత కొన్ని ఏళ్లుగా రీమేక్ లు రీమిక్స్ లు, సీక్వెల్ లకు మాత్రమే పరిమితమైంది. కాగా బాలీవుడ్ ఇప్పటివరకు డిస్పాయింట్ చేయని జానర్ ఏదైనా ఉందంటే అది కేవలం ప్రముఖ వ్యక్తుల బయోపిక్స్ ను సినిమాలుగా మలచటంలో మాత్రమే అని చెప్పాలి. ఇప్పటికి చాలా మంచి బయోపిక్స్ ను సినిమాలుగా మలిచిన బాలీవుడ్ ఒక్క సినిమా విషయంలో కూడా నిరాశపరచలేదు.

అయితే లేటెస్ట్ గా ప్రముఖ సింగర్ ల‌తా మంగేష్క‌ర్ బయోపిక్ చేయాలనీ బాలీవుడ్ లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రద్ధ కపూర్ ఆమెకు చాలా కాలంగా ప‌ద్మిని కొల్హాపురే, ల‌తా మంగేష్క‌ర్ బయోపిక్ లో నటించాలని ఉందని తెలిపింది. ఆ ఇద్ద‌రు వ్య‌క్తులు ఎంతో గొప్ప‌వారు. వాళ్ల జీవితాల్లో ప్ర‌తీ ద‌శ ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. వాళ్ల జీవితాల్లో ఎన్నో స‌వాళ్లున్నాయి, అలాంటి వ్య‌క్తుల జీవితాల్లో న‌టించాలంటే అదృష్టం కూడా క‌లిసి రావాలంటూ వ్యాఖ్యలు చేసింది. వ్య‌క్తిగ‌తంగా వాళ్లు సాధించిన ల‌క్ష్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారి జీవితాల్లో న‌టిస్తేనటిగా తన జీవితానికి సార్ద‌క‌థ ద‌క్కుతుందంటూ ఆమె చెప్పుకొచ్చింది. మరి శ్రద్ధ కపూర్ కోరికను బాలీవుడ్ మేకర్స్ పరిగణలోకి తీసుకొని ల‌తా మంగేష్క‌ర్ బయోపిక్ లో శ్రద్ధ కపూర్ ను తీసుకుంటారో లేదో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmifyASHW

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు