Allu Arjun’s Pushpa2: సందీప్ రెడ్డి నెక్స్ట్ ఛాయిస్ ఎవరు..?

Allu Arjun’s Pushpa2

అర్జున్ రెడ్డి సినిమా ద్వారా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ప్రస్తుతం రన్బీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేస్తున్న సందీప్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మరో మూవీ కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సందీప్ తన నెక్స్ట్ మూవీ ఎవరితో చేయనున్నాడని ఆసక్తి మొదలైంది. ప్రభాస్ ప్రస్తుతం సలార్, కల్కి సినిమాలతో పాటుగా డైరెక్టర్ మారుతితో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. మరో పక్క అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ లో బిజీగా ఉండగా ఈ సినిమా పూర్తి కాకముందే త్రివిక్రమ్ తో సినిమా అనౌన్స్ చేసాడు.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ ఇంకా ఫైనలైజ్ కావాల్సిన క్రమంలో పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ సందీప్ తో చేయబోయే సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో ఉన్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలే కావటంతో స్పిరిట్ సినిమా పట్టాలెక్కాలంటే ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

మొదట డిసెంబర్లో రిలీజ్ కి ప్లాన్ చేసిన పుష్ప2 సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని టాక్ వినిపిస్తుంది. రిలీజ్ డేట్ పై క్లారిటీ లేకపోవటం వల్లే సినిమా గురించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదని అంటున్నారు. 2024 సమ్మర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న ఈ సినిమాను సుకుమార్ పార్ట్ 1 ని మించిన రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడని వార్తలొస్తున్న నేపథ్యంలో పుష్ప2 అల్లు అర్జున్ కి మరో పాన్ ఇండియా హిట్ ఇస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు