Pushpa2: అల్లు అర్జున్ కి షాక్ ఇచ్చిన శ్రీలీల..!

Pushpa2

టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరొయిన్ గా మారింది కన్నడ భామ శ్రీలీల. ప్రస్తుతం అరడజనుకి పైగా సినిమాలను వరుసగా లైన్లో పెట్టిన శ్రీలీల సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే ఇంతటి క్రేజ్ సంపాదించటం ఒక్క శ్రీలీలకు మాత్రమే చెల్లిందనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం టాలీవుడ్లో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారింది శ్రీ లీల. ప్రస్తుతం శ్రీలీల డేట్స్ అడ్జస్ట్ కావాలంటే ఒక సంవత్స్రరం పాటు వెయిట్ చేయాలిసిన పరిస్థితి ఉందని టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సినిమాలో నటించే ప్రపోజల్ ను శ్రీలీల రిజెక్ట్ చేసిందన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప2 సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం సినిమా యూనిట్ శ్రీలీలను సంప్రదించాడని, భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ డేట్స్ ఇష్యూ వల్ల రిజెక్ట్ చేసిందని అంటున్నారు.

వినిపిస్తున్న వార్తలు గనక నిజమే అయితే, శ్రీలీల గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నట్లే అని చెప్పాలి. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయిన పుష్ప సినిమా సీక్వెల్ లో శ్రీలీల గనక ఐటమ్ సాంగ్ చేసి ఉంటే సౌత్ కి మాత్రమే పరిమితం అయిన ఈ అమ్మడి క్రేజ్ పాన్ ఇండియా వైడ్ స్ప్రెడ్ అయ్యుండేది. మరి, సౌత్ లో దూసుకుపోతున్న శ్రీలీలకి పాన్ ఇండియా హిట్ ఎప్పుడు దక్కుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు