Pawan Kalyan’s OG: ఇక ‘ఓజి’ మేనియా షురూ – భక్తులూ బీ రెడీ..!

Pawan Kalyan’s OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ), మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ఇవాళ విడుదలయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక పక్క పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఏ మాత్రం బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా అనుకున్న సమయానికే రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం బ్రో యుఫోరియా ఎంజాయ్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్ కి ఇంకొక కిక్ ఇచ్చే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవన్ కాస్త గ్యాప్ ఇచ్చి ఆగస్టులో ఓజి సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడని తెలుస్తోంది.

ఫిబ్రవరిలో మొదలైన ఓజి సినిమా షూటింగ్ కూడా గ్యాప్ లేకుండా శరవేగంగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ షూటింగ్ కి బ్రేక్ ఇవ్వకుండా మిగతా ఆర్టిస్ట్స్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసాడు డైరెక్టర్ సుజిత్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డేట్స్ మళ్లీ దొరకడంతో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సీన్స్ సాధ్యమైనంత వరకు కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమాను సుజిత్ తన పక్కా ప్లానింగ్ తో అనుకున్న టైమ్ కే రిలీజ్ చేయనున్నాడని క్లారిటీ వస్తోంది. మాఫియా బ్యాక్డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో గ్యాంగ్స్టర్ గా కనిపించనున్న పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ మూడు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో ఉంటుందని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న సినిమాలు అన్నిటికంటే ఓజి సినిమా కోసమే ఎక్కువ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పవన్ ఫ్యాన్స్. మరి, పవన్ కళ్యాణ్ కి టైలర్ మేడ్ లాంటి గన్స్ సెటప్ తో రాబోతున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు