Rana’s Hiranyakashyap: గుణశేఖర్ కి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన రానా..!

Rana’s Hiranyakashyap

హిరణ్యకశ్యప సినిమా విషయంలో జరుగుతున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకుంటున్న గుణశేఖర్, హిరణ్యకశ్యప సినిమాను రానా హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ చేయాలని ప్లాన్ చేసాడు. కారణమేంటో తెలీదు కానీ, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే, ఇటీవల ప్రతిష్టాత్మక కామిక్ కాన్ వేదికగా రానా ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయటంతో రచ్చ మొదలైంది. త్రివిక్రమ్ అందించే కథతో తన సొంత బ్యానర్ స్పిరిట్ మీడియా బ్యానర్ పై ఉంటుందని అనౌన్స్ చేసిన రానా దర్శకుడు ఎవరన్నది అనౌన్స్ చేయలేదు. దీంతో తన ప్రమేయం, అనుమతి లేకుండా ఇంకొక దర్శకుడితో సినిమా చేయటం ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడతా అని అవసరం అయితే, లీగల్ గా కూడా ప్రొసీడ్ అవుతానంటూ స్టేట్మెంట్స్ ఇచ్చాడు.
అయితే, ఇటీవల రానా విడుదల చేసిన హిరణ్యకశ్యప కాన్సెప్ట్ వీడియోతో గుణశేఖర్ కి చెక్ పడినట్లయింది. కామిక్ స్టైల్ లో డిఫరెంట్ స్కెచెస్ తో సినిమా స్టోరీ లైన్ ప్రొజెక్ట్ అయ్యేలాగా డిజైన్ చేసిన ఆ వీడియోలో ప్రహ్లాద క్యారెక్టర్ ని కూడా చూపించారు. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ లో ప్రముఖ పబ్లిషింగ్ సంస్థ ‘అమర్ చిత్ర కథ’ ఇన్వాల్వ్ అవ్వటం.
1973లో అమర చిత్ర కథ సంస్థ పబ్లిష్ చేసిన ‘ప్రహ్లాద’ కామిక్ స్టోరీ బుక్ లోని కథ ఆధారంగా రానా హిరణ్యకశ్యప సినిమా ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఈ కథకు గుణశేఖర్ కి సంబంధం లేనట్లే అయ్యింది. ఈ నేపథ్యంలో గుణశేఖర్ హిరణ్యకశ్యప సినిమా విషయంలో లీగల్ ప్రొసీడ్ అయ్యేందుకు ఛాన్స్ మిస్ అయినట్లయ్యిందని చెప్పాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు