RAPO’s Double Ismart: సంజు భాయ్ టాలీవుడ్‌కి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ?

RAPO’s Double Ismart

సంజు భాయ్ అలియాస్ సంజయ్ దత్.. ఈయనకు హీరోగా ఆడియన్స్ మనుసులను గెలుచుకోవడం తెలుసు. విలన్ గా హీరోను ఢీ కొనడం తెలుసు. బాలీవుడ్ స్టార్ హీరోగా  ఓ వెలుగు వెలిగిన సంజు భాయ్, డ్రగ్స్ కేసులో సుదీర్ఘకాలం జైలు శిక్ష తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి  ప్రస్తుతం విలన్ రోల్స్ చేస్తూ దడ పుట్టిస్తున్నాడు. కేజీఎఫ్ 2లో సంజు భాయ్ చేసిన అధీర రోల్ నెవర్ బిఫోర్. నిజానికి అధీర రోల్ తర్వాతే, సంజు భాయ్ విలనిజానికి డిమాండ్ పెరిగింది.
విజయ్ దళపతి లియోలో కూడా విలన్ పాత్ర చేస్తున్న సంజు భాయ్ టాలీవుడ్ కి కమ్ బ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని టాక్. సంజు 25 ఇయర్స్ బ్యాక్ కింగ్ నాగార్జున నటించిన చంద్రలేఖలో ఓ చిన్న పాత్ర చేశాడు. దీని తర్వాత ఎప్పుడు కూడా టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ కనిపించలేదు. 25 ఇయర్స్ తర్వాత సంజు టాలీవుడ్ కు కం బ్యాక్ ఇవ్వబోతున్నారని సమాచారం.
పూరి జగన్నాథ్ – రామ్ పోతినేని కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీలో విలన్ పాత్రకు సంజు బాయ్‌ని ఫైనల్ చేశారట. దీంతో సంజు భాయ్ టాలీవుడ్ కంబ్యాక్ కు ఇలా మూహుర్తం కుదిరింది అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కేజిఎఫ్ సినిమాలో అధీర రోల్ కి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ని డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం వాడుకునేందుకు ప్లాన్ చేశాడు పూరి.
ఎన్నో అంచనాలతో వచ్చిన పూరి గత చిత్రం లైగర్ ఘోర డిజాస్టర్ అయిన నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్ ద్వారా బ్లాక్ బస్టర్ అందుకొని స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలన్న కసితో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. హీరో రామ్ కి కూడా ఇస్మార్ట్ శంకర్ తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేకపోవటంతో ఈ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. మరి, రామ్ – పూరిలకు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ అవసరమైన నేపథ్యంలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాకి సంజయ్ దత్ రీఎంట్రీ ఏ మేరకు ప్లస్ అవుతుందో అన్నది వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు