Bigg boss 7 Latest Update: బిగ్ బాస్ షో నుంచి నాగార్జున అవుట్ ? కొత్త హోస్ట్ ఎవరంటే ?

Bigg boss 7 Latest Update

తెలుగు ప్రేక్షకుల ఫెవరెట్ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అత్యంత ప్రజాదరణతో సక్సెస్ ఫుల్ గా ఆరు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం ఏడోవ సీజన్ లోకి అడుగుపెట్టబోతుంది. ఈ ఏడోవ సీజన్ కు సంబంధించి బిగ్ బాస్ టీం ఇప్పటికే అప్డేట్స్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేసారు.

గత షో లకుహోస్ట్ వ్యవహరించిన నాగార్జుననే ఈ షో కు కూడా హోస్ట్ గా చేయబోతున్నట్టు ప్రోమోస్ కూడా రిలీజ్ చేసారు. ఇంకా రేపో మాపో ఈ షో కూడా మొదలు అవబోతుందనగా బిగ్ బాస్ టీం పెద్ద ట్విస్ట్ ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. అదేంటంటే ఈ షోకు ఇక నుంచి నాగార్జున ను హోస్ట్ గా చేయబోవడం లేదనే న్యూస్ వినిపిస్తోంది

వివరాల్లోకి వెళ్తే… బిగ్ బాస్ మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసారు. ఆ తరువాత సెకండ్ సీజన్ నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక ఆ తరువాత మూడవ సీజన్ నుంచి కింగ్ నాగార్జుననే ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే గత కొద్దీ కాలంగా బిగ్ బాస్ షోలో నాగార్జున హోస్టింగ్ ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ఆయనను తీవ్రంగా విమర్శించడం మొదలు పెట్టారు. యాంకర్ ను మార్చాల్సిందిగా ప్రేక్షకులు యాజమాన్యాన్ని డిమాండ్ చేసారు. అయితే వేరే సెలెబ్రెటీలేవారు ఈ షో కు యాంకరింగ్ చేయడానికి ఇష్టపడకపోవడంతో నాగార్జుననే కంటిన్యూ చేయవలసి వస్తుంది.

- Advertisement -

అయితే ఈ ఏడోవ సీజన్ కు మాత్రం నాగార్జున కొన్ని రోజులు మాత్రమే హోస్ట్ చేస్తాడనే వార్త గట్టిగ వినిపిస్తోంది. ఈ మేరకు అగ్రిమెంట్ కూడా జరిగిందట. దాదాపు 3 నెలల పాటి జరిగే ఈ షో, మొదటి నెల మాత్రమే నాగార్జున చేస్తాడట ఆ తరువాత యాంకర్ మారతాడంట. అయితే ఆ కొత్త యాంకర్ ఎవరు అనేది మాత్రం ఇంకా కన్ఫామ్ కాలేదు. అయితే ఈ నిర్ణయాన్ని తీసుకుంది కూడా స్యయంగా నాగార్జుననే అనిసమాచారం . తొందర్లోనే ఈ విషయంపై అఫీషియల్ గా ప్రకటన కూడా వెలుబడనుందట. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం రమ్యకృష్ణ హోస్ట్ గా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmifyASHW

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు