Rashmika: నేషనల్ క్రష్ కు హ్యాపీ బర్త్ డే

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈ రోజు రష్మిక బర్త్ డే. ఈ సందర్బంగా తన గురించి తెలుసుకుందాం. 1996 ఏప్రిల్ 5 న పుట్టిన రష్మిక కన్నడ నేల నుంచి వచ్చింది. ఈ బ్యూటీ సొంతూరు కర్ణాటకలోని కొడగు జిల్లా లోని విరాజ్ పేట్ అనే పట్టణం. బెంగుళూర్ లోని ఎం.ఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ అఫ్ కాలేజ్ లో జర్నలిజం చదివింది రష్మిక.

సినిమాల మీద ఇంట్రెస్ట్ తో 2016 లో కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా తోనే సూపర్ హిట్ తెచ్చుకోగా, ఆ సినిమా లో హీరోగా నటించిన రక్షిత్ శెట్టి ని తో ప్రేమలో పడింది. 2017 లో వీళ్ల ఎంగేజ్ మెంట్ జరిగింది. తర్వాత పెళ్లి వరకు రాకుండనే వీరి లవ్ బ్రేకప్ అయింది.

ఇటు తెలుగులో 2018 లో “ఛలో” సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వగా, “గీతా గోవిందం” సినిమా తో స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఇక వెనుదిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాలు చేసింది. ఇక 2021 లో వచ్చిన పుష్ప తో నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని నేషనల్ క్రష్ గా తనదైన ముద్ర వేసింది. అటు తమిళం లోను సుల్తాన్, వారిసు సినిమాలతో సూపర్ హిట్ల ను కొట్టి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా నిలిచింది.

- Advertisement -

ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ తర్వాత నితిన్ తో ఓ సినిమా, అలాగే హిందీలో యానిమల్ మూవీలోను నటిస్తుంది. ఇక ఈ మధ్యనే లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసింది. తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్న రెయిన్ బో అనే సినిమాలో మెయిన్ లీడ్ గా నటిస్తుంది. తన కెరీర్ లో మరిన్నీ విజయాలను అందుకోవాలని ఆశిస్తూ మరొక్క సారి “Filmify” టీమ్ తరపున రష్మిక మందన్న కు హ్యాపీ బర్త్ డే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు