Soppana Sundari: తమిళంలో జోరు మీదున్న తెలుగమ్మాయి

ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయి అయినా తమిళ సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకొని అక్కడ మంచి పెర్ఫార్మన్స్ చేసే హీరోయిన్ల లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు లో కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఐశ్వర్య రాజేష్ ఒకప్పటి తెలుగు హీరో అయిన రాజేష్ కుమార్తె. అంతే కాదు హాస్య నటి శ్రీ లక్ష్మి మేనకోడలు. తన చిన్నతనం లోనే తండ్రి చనిపోవడంతో ఐశ్వర్య ఎన్నో కష్టాలు పడింది. ఒక కంపెనీ లో ఏడు వేలకు జాబ్ చేసింది. ఆ తర్వాత అదృష్టం తలుపు తట్టి హీరోయిన్ గా ఆఫర్స్ వచ్చాయి.

కనా సినిమా తో తమిళం లో హీరోయిన్ గా మంచి ముద్ర వేసి స్టార్ అయింది. ప్రస్తుతం తమిళం, మలయాళం కలిపి అరడజను కు పైగా సినిమాలు చేస్తుంది ఐశ్వర్య.

అయితే ప్రస్తుతం ఐశ్వర్య నటించిన స్వప్న సుందరి అనే తమిళ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది.ఎస్ .జి చార్లెస్ అనే తమిళ డైరెక్టర్ తీసిన ఈ సినిమా ఏప్రిల్ 14 న విడుదల అవుతుంది. అయితే ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల గురించి మాత్రం ప్రోడుసర్స్ కి కొంచెం కంఫ్యూసింగ్ గా ఉంది.

- Advertisement -

ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ఏపీ ఇంటర్నేషనల్ అనే సంస్థ దక్కించుతుంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సంస్థ UK,యూరప్ లను మినహాయించి మిగతా ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తామని ప్రకటించారు. అయితే ఈ రెండు ఏరియా లను ఈ సినిమా తీసిన ప్రొడక్షన్ కంపెనీల్లో ఒకటైన అహింస ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఈ రెండు ఏరియాల్లో రిలీజ్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు