Mega Daughter: మామిడికాయ తిన్న నిహారిక – నెట్టింట ప్రశ్నల వెల్లువ..!

గత కొంత కాలంగా నిత్యం వార్తల్లో ఉంటున్న మెగా డాటర్ నిహారిక, ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయటంతో మళ్ళీ టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచారు. వివరాల్లోకి వెళితే మామిడికాయ తింటూ నిహారిక పోస్ట్ చేసిన వీడియో కింద నెటిజన్లు ప్రెగ్నెంట్ ఆ అంటూ ప్రశ్నించటం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు పుల్లటి మామిడి తినాలని కోరటం సహజం కాబట్టి నిహారిక పోస్ట్ చేసిన ఈ వీడియో చుస్తే అదే డౌట్ రావటంలో అర్థం ఉంది. కానీ, గత కొంత కాలంగా నిహారిక చైతన్య దంపతులు డైవర్స్ తీసుకోబోతున్నారంటూ వార్త  హల్చల్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో నిహారిక ఈ వీడియో పోస్ట్ చేయటంతో డైవర్స్ అనౌన్స్ చేయబోయే ముందు ఇలాంటి షాకింగ్ అనౌన్స్మెంట్ ఏదైనా ఉండబోతుందా అన్న అనుమానానికి తావిస్తోంది.

అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ ఒకసారి గమనిస్తే అలాంటిదేమి లేదని, ఇది వేసవి కాలం కావటం ఇపుడిపుడే మామిడి పళ్ళు అందుబాటులోకి రావటంతో మామిడిపై తనకున్న ఇష్టాన్ని నిహారిక ఈ రకంగా వ్యక్తపరిచారని అర్థమవుతోంది. అంతే తప్ప నెటిజన్స్ అత్యుత్సాహం చూపినట్టు ప్రెగ్నెన్సీ లాంటిది ఏమీ లేదని స్పష్టం అవుతోంది.

- Advertisement -

ఈ మధ్య సెలబ్రిటీల విషయాల పట్ల నెటిజన్స్ అత్యుత్సాహం చూపటం సాధారణం అయిపోయింది. అలా అత్యుత్సాహం చూపిన నెటిజన్స్ కొంత మందిపై సెలెబ్రిటీలు సైబర్ క్రైమ్ ను ఆశ్రయించటం, కటకటాల పాలవడం కూడా జరిగింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు