Samantha: సమంత బాలీవుడ్ పయనం వెనుక ఆ హీరోయిన్ హస్తం…!

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత ఎప్పుడైతే విడాకులు తీసుకుందో అప్పటి నుండి నిత్యం ఎదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తూ వస్తుంది. తాజాగా తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ ఒక ప్రముఖ వెబ్సైట్ పై తన ట్విట్టర్ ద్వారా మండిపడింది. ఇదిలా ఉంటే, సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో వరుణ్ ధావన్ సరసన సమంత నటిస్తుండగా, సమంత వరుణ్ ల కాంబోలో గతంలోనే ఒక సినిమా రావాల్సి ఉండగా సమంత డైవర్స్ ఇష్యూ వల్ల ఆ సినిమా కార్యరూపం దాల్చలేదని టాక్ వినిపిస్తోంది. నాగచైతన్యతో డైవర్స్ తర్వాత సమంత తీరులో చాలా మార్పు వచ్చింది.

విడాకుల తర్వాత గ్లామర్ షో పెంచిన సమంత, తనపై వస్తున్న రూమర్స్ మీద కూడా నిర్మొహమాటంగా స్పందిస్తూ వాటిని ఖండిస్తూ వస్తుంది. ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధితో బాధపడి కోలుకున్న సమంత మరింత స్పీడ్ పెంచినట్లు కనిపిస్తుంది. తెలుగులో శాకుంతలం విడుదలకు సిద్ధంగా ఉండగా మరో పక్క సిటాడెల్ తో బాలీవుడ్ లో కూడా సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. సమంత బాలీవుడ్ ఎంట్రీ వెనుక హీరోయిన్ తాప్సి గైడెన్స్ ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. తెలుగు సినిమా ఝుమ్మంది నాధం ద్వారా వెండితెరకు పరిచయమైన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చి పలు సందర్భాల్లో టాలీవుడ్ పై నోరు పారేసుకుంది.

ఈ మధ్య సోషల్ మీడియాలో సమంతపై ట్రోల్స్ వస్తున్నప్పటికీ అవేమి ఆమె మార్కెట్ పై ప్రభావం చూపలేదు. అయితే ప్రస్తుతం శాకుంతలం సినిమాకు అంతగా బజ్ లేకపోవడం చూస్తుంటే ఆ సినిమా సక్సెస్ అంత ఈజీ కాదేమో అనిపిస్తుంది. తాప్సి గైడెన్స్ తో బాలీవుడ్ వెళ్తోన్న సమంత కూడా తాప్సి లాగే టాలీవుడ్ కి దూరం అవుతుందా, లేక అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ను బ్యాలెన్స్ చేస్తుందా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు