KushiMusicalConcert : మీ అందరి మొహాల్లో నవ్వు చూడటమే నా టార్గెట్- విజయ్ దేవరకొండ

KushiMusicalConcert

“చివరిగా మీ అందరు బాగా ఎంజయ్ చేసిన సినిమా.. మీకెప్పుడు ఇచ్చానో నాకు గుర్తు లేదంటూ” ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ లో ఎమోషనల్ అయ్యాడు విజయ్ దేవరకొండ. 6 ఏళ్ళ తన ఫిలిం కెరీర్ లో హైట్స్- లో(LOW)స్ చూస్తున్న కానీ తన అభిమానుల్లో ప్రేమ మాత్రం కన్సిస్టెంట్ గా ఉందని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ నిన్న సాయంత్రం గ్రాండ్ గా జరిగింది. గతంలో ఉండే సినిమా ఫంక్షన్ ల ఆడియో లాంచ్ ట్రెండ్ అంతరించి పోయి, ప్రి రిలీజ్ ఈవెంట్ ల ట్రెండ్ నడుస్తుండగా ఖుషి సినిమా మ్యూజికల్ కాన్సర్ట్ కు మంచి ప్రేక్షకాదరణ లభించింది.

విజయ్ దేవరకొండ నటించే సినిమాల సంగతి ఎలా ఉన్న కూడా సినిమా ప్రమోషన్స్ మాత్రం విజయ్ దేవరకొండ ప్రమోట్ చేసినట్టు వేరే ఏ హీరో చేయడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. హీరో అంటే యాంకర్ పిలిచినప్పుడు ఎంట్రీ ఇచ్చి, వెళ్లి సైలెంట్ గా సోఫాలో కూర్చొని అందరు చేసే పెర్ఫామెన్స్ చూడాలనే ముసా ధోరణి ని విజయ్ దేవరకొండ ఏనాడు పాటించలేదు. స్టేజ్ ఎక్కి ఈవెంట్ కు వచ్చిన ప్రేక్షకులను తనకు తోచిన విధంగా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు. ఇక లేటెస్ట్ గా ఖుషి సినిమా మ్యూజికల్ కాన్సర్ట్ లో కూడా విజయ్ దేవరకొండ అలాగే చేసాడు. సమంత తో ఖుషి సినిమా టైటిల్ సాంగ్ కు స్టెప్స్ వేసి ఈవెంట్ కు వచ్చిన అందరిని ఎంటర్టైన్ చేసిన విజయ్ దేవరకొండ, తన స్పీచ్ తో కూడా అందరిని ఆకట్టుకున్నాడు.

- Advertisement -

ఖుషి సినిమాతో తనను ప్రేమించే అందరి మొహాల్లో నవ్వు చూస్తే చాలంటూ విజయ్ దేవరకొండ స్పీచ్ ఇచ్చాడు. సమంత ఆరోగ్యం విషయం గురించి చాలా సేపు మాట్లాడిన విజయ్, ఆమె త్వరలోనే కోలుకోవాలని విష్ చేసాడు. డైరెక్టర్ శివ నిర్వాణ సినిమా ఎంత లేట్ అవుతున్న కూడా ఎప్పుడు కూడా చిరాకు, పరాకులు లేకుండా చాలా ప్రేమతో ఖుషి సినిమా తీసాడంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. ఖుషి సినిమాకు పని చేసిన మిగితా టెక్నీషియన్స్ గురించి మాట్లాడుతూ అందరు ఖుషి సినిమా చాలా ప్రేమించి చేసారు వాళ్ళందరి కోసం ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్న అని విజయ్ తన స్పీచ్ ను ముగించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు