Ritika Singh: ఇక్కడ పట్టించుకోవట్లేదు.. కానీ అక్కడ ఇరగదీస్తుంది.

టాలీవుడ్ లో గురు సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన ఊరమాస్ పెర్ఫార్మన్స్ తో అందర్నీ ఆకర్షించిన భామ రితికా సింగ్. స్వతహాగా మార్షల్ ఆర్టిస్ట్ అయిన రితిక సినిమాలపై మక్కువ తో ఇండస్ట్రీకి వచ్చింది. అలా సుధ కొంగర తీసిన “ఇరుధి సుట్రు” లో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో ఒక బాక్సర్ గా నటించిన రితికా తన ఫస్ట్ మూవీతోనే విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆ సినిమానే తెలుగులో గురు పేరుతో రీమేక్ చేసారు.

అయితే ఆ తర్వాత మాత్రం తెలుగులో మళ్ళీ చేయలేదు రితిక. చివరగా 2018లో వచ్చిన “నీవెవరో” సినిమాలో నటించినా అందులో మెయిన్ లీడ్ కాదు. అయితే ఆ చిత్రం అంతగా ఆడలేదు. దాదాపు తెలుగులో రితికా సింగ్ కనిపించి ఐదేళ్లు అవుతుంది. అయితే తెలుగులో సినిమాలు చేయకపోయినా ఇతర భాషల్లో మాత్రం ఇరగదీస్తోంది. ముఖ్యంగా తమిళ్ లో వరుస సినిమాల్లో దూసుకుపోతుంది.

చివరగా “ఓ మై కాదవులే” సినిమా తో హిట్ కొట్టిన ఈ సుందరి ప్రస్తుతం తమిళ్ లో విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న  “కొలై” అనే సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది. ఈ సినిమా తెలుగు లో హత్య పేరుతో విడుదల అవుతుంది. ఈ సినిమాయే గాకుండా మరో మలయాళం సినిమా, ఒక హిందీ సినిమాలోనూ నటిస్తుంది.

- Advertisement -

ఇక రితికా సింగ్ ప్రస్తుతం తెలుగులో ఏ సినిమాలు చేయకపోయినా, మంచి స్క్రిప్ట్ వస్తే చేస్తానని పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. ప్రస్తుతం కొలై మూవీ ప్రమోషన్లలో బిజీ గా ఉన్న ఈ భామ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి టచ్ లోనే ఉంటుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు