Custody: నాగ చైతన్య పాన్ ఇండియా సినిమా టైటిల్ లీక్

హిట్, ఫ్లాప్ సినిమాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు అక్కినేని నాగ చైతన్య. కమర్షియల్ సినిమాల కంటే విభిన్న సినిమాలు, విలక్షణ పాత్రలు చేయడానికి ఇష్టపడే చైతన్యకు గత కొద్దీ రోజులుగా ఫ్లాప్ సినిమాలే వస్తున్నాయి. కానీ అయిన కూడా చై వెనక్కి తగ్గకుండా మళ్ళీ అలాంటి ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడానికే ఆసక్తి చూపిస్తున్నాడు.

ప్రస్తుతం నాగ చైతన్య, కార్తికేయ2 సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన చందు మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలనే నాగ చైతన్య నటించిన కస్టడీ సినిమా ఆశించినంత విజయం సాధించక పోయిన ఈ సినిమా ఇంత పెద్ద ఎత్తున ప్లాన్ చేయడానికి ప్రధాన కారణం డైరెక్టర్ చందు మొండేటి. కార్తికేయ 2 తరువాత ఈ దర్శకుడికి ఇండియా వైడ్ మంచి పేరు రావడంతో ఈ బ్రేవ్ స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తుంది.

వైజాగ్ లోని మత్స్య కారుల జీవితాల ఆధారంగా తీయబోయే ఈ సినిమాలో నాగ చైతన్య ఒక జాలరిగా కనిపించబోతున్నాడు. హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకోబోతున్నట్టు సమాచారం. అలాగే ఈ సినిమాకి గాను మ్యూజిక్ అందించడానికి తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ను సంప్రదించినట్టు టాక్ వస్తుంది. దీన్ని బట్టి చూస్తే అల్లు అరవింద్ ఈ సినిమాను ఏ స్థాయిలో తీయబోతున్నాడో అర్థమవుతోంది. అయితే ఈ సినిమాకు తండేలు అనే టైటిల్ ను పెట్టబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా తొందర్లోనే షూట్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు