Ritika Singh: సినిమాలే కాదు.. ఇకనుండి ఐటెం సాంగ్స్ కూడా?

Ritika singh item song:

మలయాళం నుండి వస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో క్రేజీ బజ్ ఉన్న సినిమా “కింగ్ ఆఫ్ కోత“. సీతారామం ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయి సూపర్ రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ అప్డేట్ వచ్చింది. అయితే సాధారణంగా ఫస్ట్ సాంగ్ అన్నప్పుడు హీరో ఇంట్రో సాంగ్ లేదా, మంచి మెసెజ్ ఇచ్చే సాంగ్ రిలీజ్ చేస్తారు. కానీ ఈ సినిమానుండి మొదటి పాట గా ఒక ఐటెం సాంగ్ రాబోతుంది.

అయితే ఈ ఐటెం సాంగ్ లో నటిస్తుంది ఎవరో కాదు. గురు బ్యూటీ రితికా సింగ్. అవును.. సినిమాల్లో హీరోయిన్ గానే కాదు ఇప్పుడు ఐటెం సాంగ్స్ ద్వారా కూడా తన క్రేజ్ పెంచుకుంటానంటుంది ఈ తమిళ్ పొన్ను. అయితే ఇప్పటివరకు సినిమాల్లో హీరోయిన్ గా తప్ప ఐటెం సాంగ్స్ చేయలేదు. అంటే రితికా ఐటెం భామగా చేస్తున్న ఫస్ట్ సాంగ్ ఇదేనన్నమాట. ఇక రీసెంట్ గానే “హత్య” అనే క్రైమ్ థ్రిల్లర్ లో ఒక పోలీస్ ఆఫీసర్ గా వచ్చి ఆడియన్స్ ని అలరించింది.

ఇక కింగ్ ఆఫ్ కోత మూవీ నుండి “హల్ల మచ్చారే” పేరుతో విడుదలవుతున్న ఈ పాట జులై 28న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. కాగా ఆగష్టు25న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా రితికా సింగ్ మరిన్ని స్పెషల్ సాంగ్స్ చేసే ఆఫర్లు దక్కించుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు