baby movie controversy : బేబీ సినిమా కాంట్రావర్సీ పై స్పందించిన విశ్వక్ సేన్

baby movie controversy

ఇటీవలనే చిన్న సినిమాగా రిలీజై, పెద్ద హిట్టైన బేబీ సినిమా గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ బేబీ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో ఎంత పెద్ద హిట్టవుతుందో అలాగే పలు కాంట్రావర్సీ లకు కూడా దారితీసింది. కాగా ఈ కాంట్రావర్సీ బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ మరియు యంగ్ హీరో విశ్వక్ సేన్ మధ్య జరుగుతున్నాయి. ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్తే..

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ బేబీ సినిమా నిజానికి డైరెక్టర్ సాయి రాజేష్, విశ్వక్ సేన్ కు చెబుదామని అనుకున్నాడట. రెండు, మూడు సార్లు విశ్వక్ సేన్ ను కలసి స్టోరీ చెప్పడానికి కూడా ప్రయత్నించగా విశ్వక్ సేన్ స్టోరీ కూడా వినకుండా ఛీ వాడితో సినిమా అంటే అస్సలు చేయను అని సన్నిహితులతో చెప్పాడంట.

ఇక ఈ విషయం తెలుసుకున్న సాయి రాజేష్ విశ్వక్ సేన్ కు స్టోరీ చెప్పే ప్రయత్నం మానుకున్నాడట. అయితే ఈ విషయాన్ని ఇటీవలనే సాయి రాజేష్ బేబీ సక్సెస్ మీట్ స్టేజ్ పై విశ్వక్ సేన్ పేరు చెప్పకుండా ఒక హీరో నన్ను రిజెక్ట్ చేశాడంటూ క్యాజువల్ గా చెప్పాడు.

- Advertisement -

దాంతో అందరు బేబీ సినిమా రిజెక్ట్ చేసిన ఆ హీరో ఎవరంటూ.. ఆరా తీయక విశ్వక్ సేన్ పేరు బయటికి వచ్చింది. దానికి తోడు విశ్వక్ సేన్ కూడా తన సోషల్ మీడియాలో హ్యాండిల్స్ లో బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ ను టార్గెట్ చేసేలా పలు ట్వీట్స్ వేసాడు. దాంతో ఈ వివాదం చిలికి చిలికి గాలి వాన అయినట్టయింది. డైరెక్టర్ సాయి రాజేష్ కూడా విశ్వక్ సేన్ ట్విట్స్ కు బదులు కూడా ఇచ్చాడు.

ఇక లేటెస్ట్ గా ఈ వివాదం గురించి విశ్వక్ సేన్ ఓపెన్ అయ్యాడు. ఇటీవలనే పేకమేడలు అనే చిన్న సినిమా టీజర్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లిన విశ్వక్ సేన్ బేబీ సినిమా కాంట్రావర్సీ పై స్పందిస్తూ నాకున్న కొన్ని సినిమాల బిజీ షెడ్యూల్స్ వల్ల ఆ సినిమా చేయలేకపోయానని, కథ విని నో చెప్పడం కన్నా వినకుండానే నో చెప్తే ఆ డైరెక్టర్ టైం వెస్ట్ అవకుండా కూడా ఉంటుందనే ఉద్దేశ్యంతో బేబీ సినిమాను రిజెక్ట్ చేసానని చెప్పుకొచ్చాడు. అయితే సోషల్ మీడియాలో మాత్రం బేబీ సినిమా గురించి, డైరెక్టర్ సాయి రాజేష్ గురించి నెగిటివ్ గా రెస్పాండ్ అయిన విశ్వక్ సేన్ స్టేజ్ పైన మాత్రం వినమ్రంగా మాట్లాడటం గమనార్హం.

మరీ ఈ కాంట్రావర్సీ ఎంత దూరం వెళ్తుందో.. దీనిపై బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు