Kushi pre release business : ఖుషి సినిమాకు భారీగా డిమాండ్

vijay devarakonda kushi pre release business

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ అందరిని ఆశ్చర్య పరుస్తుంది. విజయ్ దేవరకొండ గత చిత్రమైన లైగర్ సినిమా డిజాస్టర్ గా నిలిచిన కూడా విజయ్ దేవరకొండ మార్కెట్ ఏమాత్రం డౌన్ అవ్వలేదని ఖుషి సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ చూస్తుంటే స్పష్టమవుతోంది.

మైత్రి మూవీస్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఖుషి సినిమాపై నిన్న మొన్నటి వరకు ప్రేక్షకులకు ఏ మాత్రం అంచనాలు లేవు. దానికి కారణం విజయ్ దేవరకొండ గత చిత్రమైన లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవడమే. అలాగే భారీ బడ్జెట్ తో సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక రెండు అతిపెద్ద డిజాస్టర్ లు అందుకున్న సమంత, విజయ్ దేవరకొండ లు జంటగా నటిస్తోన్న ఈ ఖుషి సినిమాపై పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చేలా చేసింది హేశం వహబ్ అబ్దుల్ మ్యూజిక్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతి సాంగ్ చార్ట్ బస్టర్ అవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అలాగే ఇటీవలనే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు కూడా ఖుషి సినిమాపై పాజిటివిటీని పెంచేలా చేసాయి. నిర్మాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవడానికి రెడీ అయింది. ఇక ఖుషి సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..  ఇప్పటికే ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ యాభై కోట్ల మార్క్ టచ్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఖుషి సినిమాకు ప్రొడ్యూసర్స్ పెట్టిన మొత్తం బడ్జెట్ ప్రి రిలీజ్ బిజినెస్ తోనే ఖుషి రికవరీ చేసేసింది టాక్ వినిపిస్తోంది. లైగర్ సినిమా ఎఫెక్ట్ ఖుషి పై కూడా కొంచెం పడలేదని ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ చూస్తే స్పష్టమవుతోంది. మంచి పాజిటివిటి మధ్య రిలీజవబోతున్న ఈ సినిమా విజయ్ దేవరకొండకు కంబ్యాక్ సినిమా అవుతుందో లేదో చూడాలి

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు