Kushi: ట్రైలర్‌లోనే మిస్టేక్స్… ఇక పరిస్థితి ఏంటో?

Kushi Movie Story Analysis

టాలీవుడ్ లో ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ అయిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న సినిమా “ఖుషి”. విజయ్ దేవరకొండ హీరోగా నటించగా, హీరోయిన్ గా టైటిల్ రోల్ లో సమంత నటించింది. వీళ్లిద్దరు ఇంతకు ముందే మహానటి లో జోడిగా నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సారి జంటగా నటిస్తుండడంతో ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమానుండి రిలీజ్ అయిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్స్ కాగా, తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది.

ఇక ఖుషి ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, కొన్ని విషయాల్లో మాత్రం మేకర్స్ అనవసరంగా కొన్ని ట్విస్ట్ లు చెప్పరేమో అనిపిస్తుంది. ట్రైలర్ ని గమనిస్తే సినిమాలో హీరో కాశ్మీర్ కి వెళ్తాడు. అక్కడ ఉన్న హీరోయిన్ ని తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఇక హీరోయిన్ కూడా తొందరగానే లవ్ చేస్తుందని తెలుస్తుంది. అనంతరం కొన్ని కారణాల వల్ల వీళ్ళ పెద్దలు పెళ్లి ఒప్పుకోకపోతే, వీళ్ళే పెళ్లి చేసుకునే పెద్దల అనుమానం నిజం కాదని నిరూపిద్దామని అనుకుంటారు.

ఆ తర్వాత ప్రతి సినిమాలో లాగే ఇందులో కూడా గొడవలు, మనస్పర్థలు జరిగి విడిపోతారు. ఫైనల్ గా ఒక్కటయ్యారా లేదా అన్నదే కథ. ఎలాంటి కథలు చాలా తెలుగు సినిమాల్లోనే చూసాం. అయితే డైరెక్టర్లు ఆ కథని ఎలా చూపిస్తారన్నదానిపైనే సినిమా ఫలితం డిసైడ్ అయ్యి ఉంటుంది. ఇక ఈ సినిమా కథ రొటీనే అయినా, డైరెక్టర్ ఇంతకు ముందు తీసిన సినిమాల మీద నమ్మకంతో ఖుషి ని చూడవచ్చు.

- Advertisement -

అయితే సినిమాలో సమంత ఒక ముస్లిం అమ్మాయిగా నటిస్తుందని అందరు అనుకున్నారు. కానీ ట్రైలర్ లోనే సమంత ముస్లిం కాదని రివీల్ చేస్తారు. ఇలా ముందే చెప్పడం వల్ల ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ తగ్గే అవకాశం ఉంది. ఇలా చాలా ముఖ్యమైన సీన్లు ముందే ట్రైలర్ లో చెప్పడంతో ఇక సినిమా ఏం చూస్తాం అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. డైరెక్టర్ శివ నిర్వాణ ఈ కథతో ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తాడో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు