Rashmika Mandanna UpComing Movies : పాన్ ఇండియా పాపా పర్ఫెక్ట్ లైనప్

Rashmika Mandanna UpComing Movies : కిరాక్ పార్టీ సినిమాతో కన్నడ ఫిలిమ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన. ఈ సినిమా కన్నడలో మంచి హిట్ అయింది. ఇక వెంకి కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఛలో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇక్కడతో వరుస అవకాశాలు రష్మిక కు లభించాయి. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన చేసిన గీత గోవిందం సినిమా 100 కోట్లను వసూలు చేసింది.

ఆ తర్వాత చేసిన డియర్ కామ్రేడ్ సినిమా అంతంత మాత్రమే ఆడింది. ఆ సినిమా ఫెయిల్ అయిన కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో అవకాశాన్ని పొందుతుంది రష్మిక. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వచ్చిన భీష్మ సినిమా కూడా మంచి హిట్ అయింది. అల్లు అర్జున్ సరసన చేసిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది రష్మిక.

ఇకపోతే పుష్ప సినిమాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. క్రికెటర్స్ పొలిటిషన్స్ చాలామంది పుష్ప మేనరిజంసును చేసి పాపులర్ అయ్యారని చెప్పొచ్చు. పుష్ప డైలాగ్స్ కూడా అంతగానే పాపులర్ అయ్యాయి . అందుకని ఇప్పుడు వస్తున్న పుష్ప 2 బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా వారిసు మంచి హిట్ అందుకుంది రష్మిక. రీసెంట్ గా వచ్చిన అనిమల్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

- Advertisement -

అనిమల్ సినిమాలో రష్మిక తన కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది అని చెప్పొచ్చు. రష్మిక లో ఇంత టాలెంట్ ఉంది అని కూడా ఈ సినిమాతోనే చాలామందికి అర్థమయింది. ఇకపోతే ప్రస్తుతం రష్మిక బీభత్సమైన లైనప్ ను ప్లాన్ చేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసున పుష్ప 2 సినిమాలో చేస్తుంది రష్మిక. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ అనే సినిమాలో కూడా కనిపించనుంది. ఇకపోతే శేఖర్ కమ్ముల ధనుష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కుబేర. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కూడా ధనుష్ సరసన రష్మిక కనిపించనుంది. అలానే విక్కీ కౌశల్ నటిస్తున్న చవ్వా సినిమాలో కూడా రష్మిక నటిస్తుంది.

వీటన్నిటిని మించి రష్మిక చేసుకున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. రష్మిక ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ లో కనిపిస్తుంది. ఇది ఒక ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా అని అర్థమవుతుంది. ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేయటం మొదలుపెట్టింది రష్మిక. ఈ సినిమాలన్నీ కూడా బాగా వర్క్ అయితే తన కెరీర్ కి ఇంకొంతకాలం తిరగలేదు అని చెప్పొచ్చు. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ తమ ప్రతిభను కనపరుచుకున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ అంటే రష్మిక అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు