Kajal Agarwal: ఫస్ట్ టైం ఆ హీరో కోసం అలాంటి పని చేసిన కాజల్..!

Kajal Agarwal.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. లక్ష్మీ కళ్యాణం సినిమా నుంచి ఇటీవల విడుదలైన భగవంత్ కేసరి సినిమా వరకు కాజల్ అగర్వాల్ చాలామంది స్టార్ హీరోలతో నటించింది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఈమెకు అందరు హీరోలతో మంచి అనుబంధంగా ఉందని.. తనకు స్నేహితులుగా ఉండేటువంటి హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరని వెల్లడించింది. కాజల్ అగర్వాల్ తెలుగు లోనే కాకుండా తమిళ్ , హిందీ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటించింది. వివాహమైన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటిస్తోంది. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా కూడా కాజల్ అగర్వాల్ సినిమాల పరంగా బిజీగా ఉన్నది. ప్రస్తుతం ఈమె చేతిలో సత్యభామ సినిమా ఉన్నది.

Kajal Agarwal: First time Kajal did such a thing for that hero..!
Kajal Agarwal: First time Kajal did such a thing for that hero..!

ఎన్టీఆర్ కోసమే స్పెషల్ సాంగ్..

ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న సందర్భంగా ఇటీవలే హోస్టుగా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చింది కాజల్ అగర్వాల్. ఈ కార్యక్రమంలో భాగంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. పలు విషయాలను తెలియజేసింది.కేవలం ఇప్పటివరకు కాజల్ అగర్వాల్ ఒక్క సినిమాలో మాత్రమే ఐటెం సాంగ్ చేసింది.. అది కూడా ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో మాత్రమే.. ఈ విషయం పైన ఆలీ కాజల్ అగర్వాల్ ను ప్రశ్నించగా.. ఈ పాట డైరెక్టర్ కోసం చేశారా లేక నిర్మాత కోసం చేశారా అని అడగగా.. కాజల్ అగర్వాల్ ఇది కేవలం ఎన్టీఆర్ కోసం మాత్రమే చేశానని వెల్లడించింది.

మా స్నేహబంధం ఎప్పటికీ మారనిది.

తన కెరియర్ లో ఎప్పుడూ కూడా ఎలాంటి స్పెషల్ సాంగ్ చేయలేదు. కానీ ఎన్టీఆర్ కోసమే స్పెషల్ గా దృష్టిలో పెట్టుకొని మరీ జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో చేశానని వెల్లడించింది కాజల్ అగర్వాల్.. తనకు ఎన్టీఆర్ తో మంచి స్నేహబంధం ఉందని.. అందుకోసమే చేశానని తెలిపింది. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో బృందావనం, టెంపర్, బాద్ షా వంటి సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. అందుకే కాజల్ అగర్వాల్ , ఎన్టీఆర్ కు మధ్య మంచి స్నేహబంధం ఏర్పడిందని అభిమానులు కూడా వాపోతున్నారు.

- Advertisement -

కాజల్ అగర్వాల్ సినిమాలు..

ఇక కాజల్ అగర్వాల్ సినిమాల విషయానికే వస్తే.. త్వరలోనే సత్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారుతుంది ఏదేమైనా వివాహం అనంతరం ఒక కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ హీరోయిన్గా బిజీ కావడం నిజంగా ఇది కాజల్ అగర్వాల్ కి మాత్రమే చెల్లిందని చెప్పవచ్చు.. ప్రస్తుతం ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ మధ్య ఉన్న బంధం మరొకసారి వైరల్ గా మారుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు