Mahendragiri Varahi : చాలా రోజులకు సెట్స్ లో బ్రహ్మీ.. మహేంద్రగిరిలో బిజీ..!

Mahendragiri Varahi : టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈ మధ్య సినిమాలు చేయడం తగ్గించిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో ఆరోగ్య కారణాల దృష్ట్యా తగ్గించగా, ఇప్పుడు కూడా పెద్దగా సినిమాలు చేయడం లేదు. బాగా స్కోప్ ఉన్న పాత్రలు వస్తే తప్ప చేయలేదు. ఇక లాస్ట్ ఇయర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన “రంగ మార్తాండ” చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఆ సినిమా లో బ్రహ్మానందం నటనకు ప్రశంసల వెల్లువ వచ్చింది. ఇక చివరగా కీడా కోలా చిత్రంలో లెంగ్తీ రోల్‌ను చేశారు. అయితే ఆ సినిమా అంతగా ప్రభావం చూపలేదు. ఇక చాలా రోజులకు మళ్ళీ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై బిజీ అవుతున్నారు. తనయుడు గౌతమ్ హీరోగా తండ్రి కొడుకులు కలిసి, త్వరలో ఓ చిత్రంలో తాత మనవళ్లు గా నటిస్తున్నారన్న విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు బ్రహ్మానందం మరో సినిమా కూడా చేస్తున్నారు. రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న రెండో ప్రాజెక్ట్‌ “మహేంద్రగిరి వారాహి”. ఈ చిత్ర గ్లింప్స్‌ను ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

మహేంద్రగిరిలో బ్రహ్మీ?

ఇక “మహేంద్రగిరి వారాహి” చిత్రంలో సుమంత్ హీరోగా నటిస్తున్నాడు. ఇక అప్పట్లో రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ తో ఈ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అయింది. సుమంత్ ఎప్పుడూ ఏదో ఒక కొత్త పాయింట్‌తోనే ప్రేక్షకుల్ని పలకరిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ మహేంద్రగిరి వారాహి సినిమాలోనూ ఆసక్తికరమైన కథ, కథనాలున్నాయని తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రంలోని ఇంపార్టెంట్ పాత్రకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ ముఖ్య పాత్రలో బ్రహ్మానందం కనిపించబోతోన్నట్టుగా చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి, నిర్మాత కాలిపు మధు వెల్లడించారు. మహేంద్రగిరి వారాహి కథ, తన పాత్ర బాగా నచ్చడంతోనే బ్రహ్మానందం ఈ నిర్ణయం తీసుకున్నారని మేకర్లు తెలిపారు. త్వరలో మొదలుకాబోయే షెడ్యూల్‌లో బ్రహ్మానందం పాల్గొనబోతున్నారని డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి తెలిపాడు.

వారాహి అమ్మవారి నేపథ్యంలో కథ..

ఇక సుమంత్ హీరోగా నటిస్తున్న ఈ (Mahendragiri Varahi) సినిమా మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రం రాబోతోంది. అందుకే సినిమాకు ఆ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇక చాలా రోజులుగా హిట్ లేక సతమతమవుతున్న సుమంత్ ఈ చిత్రం మళ్లీ తన సత్తాను చాటేలా కనిపిస్తోంది. ఇక లాక్ డౌన్ తర్వాత బ్రహ్మానందం హాస్య పాత్రలు కాకుండా, నటనకు స్కోప్ ఉన్న పాత్రలే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ సినిమాలో కూడా బ్రహ్మానందం అలాంటి పాత్రే చేస్తున్నారని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు