Vijay Devarakonda: విజయ్ దేవరకొండ మార్కెట్ ఏంటో మళ్ళీ చూడొచ్చు

Vijay Devarakonda: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో విజయ్ దేవరకొండ ఒకరు. 2011 లో వచ్చిన నువ్విలా అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో కనిపించాడు. అయితే విజయ్ దేవరకొండ కి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాత్రం ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ సినిమాలో రిషి అనే పాత్రలో కనిపించి తనలోని టాలెంట్ ను బయటపెట్టాడు ఈ యంగ్ హీరో.

ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన పెళ్లిచూపులు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చూసి ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత చేసిన ద్వారకా సినిమా అంతంత మాత్రమే ఆడింది. అయితే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండని స్టార్ హీరోను చేసేసింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సినిమా అంటే ఆడియన్స్ థియేటర్ కి ఎగబడే వాళ్ళు అని చెప్పొచ్చు.

అర్జున్ రెడ్డి నుంచి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత రిలీజ్ అయిన గీతగోవిందం సినిమా దాదాపు 100 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత నోటా సినిమా అంతంత మాత్రమే ఆడింది. ఆ తర్వాత చేసిన టాక్సివాలా కూడా మంచి ఘన విజయాన్ని సాధించింది. ఇకపోతే 2018 తర్వాత ఇప్పటివరకు తన కెరియర్ లో చెప్పుకోదగ్గ హిట్ సినిమా అయితే పడలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్, లవర్, లైగర్, ఖుషి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయాయి.

- Advertisement -

విజయ్ దేవరకొండ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్న కూడా తనకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ మార్కెట్ ఏంటో నిజంగా తెలియనుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు విజయ్ చేస్తున్న సినిమాలు అన్నీ కూడా మంచి లైనప్ లో ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ తన 12వ సినిమాను గౌతమ్ తిన్ననూరి తో చేస్తున్నాడు. ఆ తర్వాత రాహుల్ దర్శకత్వంలో 14వ సినిమా చేస్తున్నాడు. అలానే రాజావారు రాణి గారు సినిమాతో మంచి హిట్ అందుకున్న రవి కిరణ్ కోలా దర్శకత్వంలో కూడా ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు విజయ్. అయితే ఈ మూడు సినిమాలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండబోతాయని అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా ఎంత టాలెంటెడ్ దర్శకులని ఇదివరకే ప్రూవ్ చేసుకున్నారు. ఇక వీళ్ళు కాంబినేషన్ లో సినిమాల కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు