Kumari Aunty Political Entry: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇన్వాల్ అయిన కుమారి ఆంటీ

Kumari Aunty Political Entry: ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్ లో ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారు ఎవరు ఊహించలేరు. ఒకప్పుడు సినిమా రంగంలోని రాణించాలి అంటే తమలోని టాలెంట్ చాలా ఆఫీసులకి వెళ్లి ఆడిషన్ ఇచ్చి తర్వాత ఒక అవకాశాన్ని సంపాదించుకుని, మెల్లగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ దాని ద్వారా గుర్తింపు సాధించుకొని, ఆ తర్వాత అందరూ గుర్తించే పాత్రలు చేసి, అక్కడితో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని కొందరు సెలబ్రిటీలు అవుతుండేవారు ఒకప్పుడు.

కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉన్న తరుణంలో ఒకరు ఫేమస్ అవ్వటం అనేది చాలా ఈజీగా జరిగిపోతుందని చెప్పొచ్చు. ఈ సోషల్ మీడియా జనరేషన్లో చాలామంది పాపులర్ అయ్యారు. ఇంస్టాగ్రామ్ రీల్స్ వలన, టిక్ టాక్ వీడియోస్ వలన చాలామంది ఈరోజు సెలబ్రిటీలు అయిపోయారు. కేవలం సెలబ్రిటీలు అవటమే కాకుండా యూట్యూబ్ లో కూడా వారిపై ఇంటర్వ్యూస్ ఉన్నాయి. వాళ్లు ఇంటర్వ్యూ కూడా డబ్బులు తీసుకుని మరి ఇవ్వడం మొదలుపెట్టారు. రీసెంట్ టైమ్స్ లో అలా ఫేమస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారని మనకు తెలియంది కాదు.

ఇకపోతే పొట్టకూటికోసం హైదరాబాద్ లో ఒక రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముకొనే మహిళ కుమారి ఆంటీ. అయితే ఒకానొక సందర్భంలో ఈమె వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టడం ఆ వీడియో కాస్త వైరల్ అవ్వటం తో ఇక్కడ ఫుడ్ బావుంటుందని చాలామంది స్ప్రెడ్ చేశారు. అక్కడితో జనాలు అంతా కూడా కుమార్ ఆంటీ దగ్గర ఫుడ్ తినడానికి వచ్చేవారు. హైదరాబాద్ కి ఎక్కడి నుంచొ వచ్చిన వాళ్ళు కూడా ఈ స్పాట్ ను వెతుక్కుంటూ వచ్చి మరి తినేవాళ్లు. ఈమె ఎంత పాపులర్ అయిందంటే అంటే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో కూడా ఈవిడ పడింది అని చెప్పొచ్చు.

- Advertisement -

ఇకపోతే ఈమె పాపులర్ అయిన తర్వాత చాలా టీవీ షోస్ కూడా ఈమెను ఇన్వైట్ చేశాయి. ఇప్పుడు ప్రస్తుతం కుమారి అంటే తెలియని వారు లేరు అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ లో కుమారి ఆంటీ కూడా ఒక కీలకపాత్రను పోషిస్తుందని చెప్పొచ్చు. తన స్వస్థలమైన గుడివాడకు చేరి అక్కడ టిడిపి అభ్యర్థి అయిన వెనిగండ్ల రాము అని ఆయనకి మద్దతుగా ప్రచారం చేస్తోంది కుమారి ఆంటీ.

మహర్షి సినిమాలో మహేష్ బాబు లాంటి మంచి మనసున్న వ్యక్తి వెనిగండ్ల రాము గారు. సినిమాలో మహేష్ బాబు ప్రజల కోసం సేవ చేస్తే, రియల్ లైఫ్ లో రాము గారు సేవ చేస్తున్నారు. 15 ఏళ్ల క్రితం గుడివాడ ఎలా ఉందో, అభివృద్ధి లేకుండా ఇప్పటికీ అలాగే ఉంది. వెనిగండ్ల రాము గారు గెలిస్తేనే గుడివాడ అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నాను. అంటూ చెప్పుకొచ్చారు కుమారి ఆంటీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు