OG : ‘ఓజి’ డేట్ కి ‘దేవర’.. ఇక పీకే సినిమా నెక్స్ట్ ఇయరేనా?

OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వలన పవన్ కళ్యాణ్ షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చేసి ప్రచారాల్లో బిజీగా ఉన్నాడు. మే 13 న ఎన్నికల పోలింగ్ అవుతుంది. ఇక జూన్ లో రిజల్ట్ ఉండగా, బహుశా పవన్ కళ్యాణ్ అప్పటివరకు కూడా బిజీ గానే ఉండొచ్చు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ లాస్ట్ ఇయర్ బ్రో మూవీ లో ప్రత్యేక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా యావరేజ్ రిజల్ట్ అందుకుంది. అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో మూడు ప్రాజెక్టులు పెండింగ్ లో ఉండగా, మూడు సినిమాలు కూడా ఏది ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. అయితే అందులో ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఈ ఏడాది రాదని తేలిపోయింది. ఈ సినిమా కి పవన్ కళ్యాణ్ గ్యాప్ ఇచ్చిన వెంటనే హరీష్ శంకర్ రవితేజ తో మిస్టర్ బచ్చన్ మొదలు పెట్టేసాడు. కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయ్యేలోపు ఈ ఇయర్ అయిపోతుంది. సో నెస్ట్ ఇయర్ లోనే ఉస్తాద్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక హరిహర వీరమల్లు ఈ ఇయర్ లోనే వస్తుందని అంటున్నా, దర్శకుడు ఛేంజ్ కావడం వల్ల టైం కి షూట్ అవుతుందా లేదా అన్న సందేహాలు ఉన్నాయి. ఇక అందరి ద్రుష్టి పవన్ కళ్యాణ్ ఓజి పై పడింది.

ఓజి డేట్ కి దేవర?

ఇదిలా ఉండగా ఈ ఇయర్ ఫస్టాఫ్ లో రిలీజ్ కావాల్సిన అనేక సినిమాలు ఎలక్షన్స్ వలన వరుస పెట్టి పోస్ట్ పోన్ అయ్యాయి. దాంతో సెకెండ్ ఆఫ్ ఇప్పుడు చాలా టైట్ గా మారిపోయింది. సెకెండ్ ఆఫ్ లో కూడా కొన్ని సినిమాలు అనుకున్న టైంకి వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తూ ఉండగా, పవన్ కళ్యాణ్ ఓజి సినిమాకి రిలీజ్ డేట్ సమస్య ఉంది. పవన్ కళ్యాణ్ “OG” సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు కానీ, ఇప్పుడు ఆ డేట్ కి వచ్చే అవకాశం కొంచం తక్కువే అని అంటున్నారు. ఇక సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ “దేవర” ఆడియన్స్ ముందుకు దసరాకి రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. అక్టోబర్ 10న సినిమా రిలీజ్ కానుందని చెప్పినప్పటికీ, రీసెంట్ టైంలో దసరా రిలీజ్ లు అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం లేదు. దాంతో పాటు పాన్ ఇండియా వైడ్ గా ఆ టైంకి పోటి ఉండే అవకాశాలు ఉండటంతో సోలో రిలీజ్ కోసం శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పుడు అక్టోబర్ 10 కన్నా ముందు, సెప్టెంబర్ 27నే ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుందని సమాచారం.

ఓజి ఇక నెక్స్ట్ ఇయరేనా?

అయితే సెప్టెంబర్ 27న దేవర రావడం కంఫర్మ్ అయితే, పవన్ కళ్యాణ్ ఓజి (OG) వాయిదా పడ్డట్టే అనుకోవాలి. ఎందుకంటే ఒకేరోజు రెండు పాన్ ఇండియా సినిమాలు వస్తే.. థియేటర్ల సమస్య ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రొడ్యూసర్లు కూడా రిస్క్ చేసే పరిస్థితి లేదు. ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత హరిహర వీరమల్లు ముందు పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే OG మూవీ కి సంబంధించి పవన్ కళ్యాణ్ 15 రోజుల డేట్లు ఇస్తే చాలు అంటున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏకధాటిగా టైం ఇచ్చే ఛాన్స్ లేదు. పైగా సుజీత్ నాని సినిమా ప్రాజెక్ట్ కూడా మొదలుపెట్టాడు. కాబట్టి ఓజి ఈ ఇయర్ వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు