HBD Singer Sunitha: సింగర్ సునీత గురించి తెలియని విషయాలు ఇవే..!

HBD Singer Sunitha.. తన అద్భుతమైన గాత్రంతో అందమైన మోముతో చూపరులను ఆకట్టుకోవడమే కాదు.. శ్రోతలను కూడా అలరిస్తున్న సింగర్ సునీత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ వరుస సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ.. మరింత బిజీగా మారుతోంది. ఇకపోతే ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి..

HBD Singer Sunitha: These are the unknown things about Singer Sunitha..!
HBD Singer Sunitha: These are the unknown things about Singer Sunitha..!

ఉపద్రష్ట సునీత.. ఈమె సింగర్ మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా.. అంతేకాదు రాంగోపాల్ వర్మ లాంటి సెన్సేషనల్ డైరెక్టర్స్ కూడా ఈమెకు హీరోయిన్ గా అవకాశం ఇస్తే.. కాదని నటనకు దూరమైంది.. కానీ తెర వెనుక మాత్రం తన గాత్రాన్ని వినిపిస్తూ.. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.. 15 సంవత్సరాల వయసులోనే సింగర్ గా సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో చిత్రాలలో సూపర్ హిట్ సాంగ్స్ మనకు అందించి.. మంచి పేరు దక్కించుకుంది.. ముఖ్యంగా చాలామంది హీరోయిన్లకు గాత్ర దానం చేసింది.. అలా దాదాపు 500 సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేసిన ఈమె ఈరోజు ఎంతో మందికి ఆమె తన గాత్రాన్ని దానం చేసిందో ఇప్పుడు చూద్దాం..

జ్యోతిక:

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి , జ్యోతిక జంటగా నటించిన సినిమా ఠాగూర్.. ఇందులో హీరోయిన్ జ్యోతికకు సునీత గాత్ర దానం చేసింది..

సౌందర్య:

మెగాస్టార్ చిరంజీవి , సౌందర్య నటించిన చిత్రం చూడాలని ఉంది.. ఈ సినిమాలో సౌందర్యకి తన అద్భుతమైన వాయిస్ ను అందించింది సునీత.

తనూరాయ్:

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన మనసంతా నువ్వే సినిమాలో మరో హీరోయిన్ తనూరాయ్ కి సింగర్ సునీత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేశారు.

సోనాలి బింద్రే:

సోనాలి బింద్రే ,ఆర్తి అగర్వాల్ హీరోయిన్ లుగా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమాలో సోనాలి బింద్రేకి ఈమె డబ్బింగ్ చెప్పారు.

కమలినీ ముఖర్జీ:

రాజా , కమలినీ ముఖర్జీ జంటగా నటించిన సినిమా ఆనంద్, అలాగే సుమంత్ హీరోగా, కమలినీ ముఖర్జీ హీరోయిన్ గా నటించిన చిత్రం గోదావరి.. ఈ రెండు సినిమాలలో హీరోయిన్ కి సునీత వాయిస్ అందించింది.

స్నేహ:

అక్కినేని నాగార్జున, స్నేహా నటించిన శ్రీరామదాసు సినిమాలో స్నేహ కి వాయిస్ అందించింది సునీత.

నయనతార:

శ్రీరామరాజ్యం చిత్రంలో సీత పాత్రలో నటించిన నయనతార కు సునీత వాయిస్ అందించింది.

ఇక వీరితోపాటు శ్రియా సరణ్ , తమన్నా భాటియా, హన్సిక మోత్వానీ, ఆర్తి చాబ్రియా తదితరులకు సునీత గాత్ర దానం చేసింది..

ఇకపోతే ఈరోజు ఈమె పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు అభిమానులు సునీతకు స్పెషల్గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే తన గాత్రంతోనే కాదు అంద చందాలతో కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈమె నటిగా మారాలని అభిమానులు కోరుకుంటున్నారు . మరి ఈ ఏడాదైనా సునీత ఇండస్ట్రీలోకి నటిగా అడుగు పెడుతుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు