Megastar Chiranjeevi: ఒక్క ఫ్లాప్ పడినంత మాత్రాన మెగా కోట బీటలు వారుతుందా..?

Megastar Chiranjeevi’s Bholashankar

“చిరంజీవి”, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకున్న క్రేజ్, ఆ మనిషికి ఉన్న ఈజ్, ఆయనకున్న ఫ్యాన్ బేస్, ఆయన డ్యాన్స్ లో ఉన్న గ్రేస్ “Irreplaceable”,”Never Before, Ever After”. సాధారణ నటుడిగా మొదలైన ‘కొణిదెల శివశంకర వరప్రసాద్’ సినీ ప్రయాణం స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎదుగుతూ ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టుగా పెరిగి తెలుగు సినీరంగ సింహాసనాన్ని అధిరోహించి 4 దశాబ్దాలుగా మకుటం లేని మహారాజుగా, వన్ అండ్ ఓన్లీ ‘మెగాస్టార్’ గా, చిరంజీవిగా సాగుతోంది. తన నాలుగు దశాబ్దాల కెరీర్లో ఎన్నో సంచలనాలు సృష్టించి, తన రికార్డులు తానే చెరిపేసి కొత్త రికార్డులు సృష్టించిన ఘనత ఆయనది. తెలుగు సినిమా చరిత్రలో బ్రేక్ డ్యాన్స్, డూప్ లేకుండా స్టంట్స్ చేయటం వంటి ట్రెండ్స్ కి నాంది పలికిన కష్టజీవి అతడు.

ఏ క్యారెక్టర్ అయినా ఇట్టే ఇమిడిపోగల పాదరసం లాంటి చురుకైన నటుడు చిరంజీవి. ఎలాంటి ఎక్సప్రెషన్ అయినా అద్భుతంగా పలికించగల అందమైన కళ్ళు ఆయన సొంతం. మంచి నీటి సముద్రం లాంటి నటుడు చిరంజీవి రూపంలో టాలీవుడ్ కి దొరకటం అదృష్టం. కమర్షియల్ ఎలిమెంట్స్ తో ముఠామేస్త్రి, జగదేకవీరుడు – అతిలోకసుందరి, ఇంద్ర వంటి బ్లాక్ బస్టర్స్ ఇవ్వగలడు, అద్వితీయమైన నటనతో ఆపద్బాంధవుడు, ఆరాధన, అభిలాష, వంటి సినిమాలతో కంటతడి పెట్టించగలడు, చంటబ్బాయ్, జై చిరంజీవ, శంకర్ దాదా ఎంబిబిఎస్ వంటి సినిమాలతో నవ్వించగలడు. కొన్ని జెనరేషన్స్ కి ఇన్స్పిరేషన్, రోల్ మాడల్ చిరంజీవి. అప్ కమింగ్ ఆర్టిస్ట్స్ కి చిరంజీవి ఒక మాత్రమే కాదు “It’s an Aspiration”.

వరుస ఫ్లాపుల తర్వాత కూడా హిట్లర్ లాంటి ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఘనత చిరంజీవిది. సినిమాలకు 9ఏళ్ళు దూరమైనప్పటికీ ఒక సాదా సీదా రీమేక్ సినిమాతో 100కోట్లు కొల్లగొట్టిన స్టామినా చిరంజీవిది. అలాంటిది ఈరోజు ఒక భోళాశంకర్ లాంటి ఫ్లాప్ పడితే ఆ మెగా కోటకు బీటలు వారుతాయా?, ముందుగా చెప్పినట్టు ఆ మంచి నీటి సముద్రం నుండి చెంచాడంత నీటిని వాడుకుంటేనే అటువంటి ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి. ఇప్పుడు మెహర్ రమేష్ అందులో విఫలమయ్యాడు కాబట్టే భోళా శంకర్ డిజాస్టర్ అయ్యింది. అంతటి డిజాస్టర్ కంటెంట్ ఉన్న సినిమాలో కూడా ప్రేక్షకుడు చివరి కూర్చోగలిగాడంటే అది కేవలం ఒక్క చిరంజీవి స్క్రీన్ ప్రజెన్స్ కారణంగానే అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. RRR లాంటి పాన్ ఇండియా హిట్స్ తో టాలీవుడ్ రేంజ్ ఆస్కార్ లెవెల్ కి ఎదిగిన ఈ తరుణంలో చిరంజీవి లాంటి అక్షయపాత్రను సరిగ్గా వాడుకుంటే అలాంటి ఎన్నో ఆస్కార్లు టాలీవుడ్ ముంగిట వచ్చి వాలుతాయి అన్నది అక్షర సత్యం No Doubt In It.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు