Jailer: రెండు రోజులకే టార్గెట్ రీచ్ అవనున్న జైలర్?

Jailer Telugu Version Target

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన రికార్డుల వేట షురూ చేసాడు. గత కొన్నేళ్లుగా సరైన సినిమా లేక రజినికాంత్ తన సత్తా చూపలేకపోయాడు. అయితే వీటన్నిటికీ తెర దించుతూ రజినీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం జైలర్ సూపర్ రెస్పాన్స్ తో థియేటర్లలో సందడి చేస్తుంది. ఫస్ట్ డే నే ఈ సినిమా అన్ని అంచనాలను మించి పోయి బ్లాక్ బస్టర్ వసూళ్లను సాధించింది. ఇక జైలర్ రజినీకాంత్ గత చిత్రమైన 2.0 సినిమా రేంజ్ లో ఫస్ట్ డే రికార్డులు సాధించింది.

జైలర్ సినిమాకి ఫస్ట్ డే 91కోట్ల గ్రాస్ రాగా, 44 కోట్ల వసూళ్లు అందుకుంది. అయితే సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయినప్పటికీ రజినీకాంత్ రీజనల్ సినిమాలాగానే తక్కువ బిజినెస్ చేయడంతో బయ్యర్లు తొందరగా సేఫ్ అయ్యే అవకాశం ఉంది. అయితే అన్ని ఏరియాల కంటే ముందు తెలుగు రాష్ట్రాలలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే జైలర్ సినిమాకి తెలుగులో కేవలం 12 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగింది.

ఇక జైలర్ ఫస్ట్ డే లోనే తెలుగు రాష్ట్రాల్లో 7కోట్ల వసూళ్లను అందుకుంది. అంటే జైలర్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 5కోట్లు రాబడితే సరిపోతుంది. దానికి రెండో రోజే సరిపోతుందని బుకింగ్స్ చూస్తే తెలిసిపోతుంది. పైగా ఈరోజు రిలీజ్ అయిన భోళా శంకర్ కూడా నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో జైలర్ కి అడ్వాంటేజ్ గా మారనుంది. ఇదే జరిగితే జైలర్ బ్రేక్ ఈవెన్ అయ్యే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగే అవుతుంది. ఇక ఓవరాల్ గా సినిమా ఆగష్టు 15 హాలిడే అడ్వాంటేజ్ తో ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు