Jailer movie: అక్కడ ఆల్ టైం రికార్డు కొట్టిన రజినీ!

Jailer movie set all time record

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన క్రేజ్ ని మళ్ళీ నిరూపించుకునే పనిలో పడ్డారు. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని రజినీకాంత్ తన లాస్ట్ మూవీ పెద్దన్న డిజాస్టర్ అందుకున్నారు. అందుకే ఇప్పుడు ఎలాగైనా భారీ సక్సెస్ కొట్టాలని జైలర్ గా వస్తున్నాడు. డాక్టర్ మూవీ ఫేమ్ నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ముందు నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ తో రజిని ఫ్యాన్స్ కూడా జైలర్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు.

ఇక సినిమా బుకింగ్స్ కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. చిత్రమేంటంటే తెలుగు సినిమా అయిన భోళా శంకర్ కంటే జైలర్ కే ఆన్లైన్ లో బుకింగ్స్ జరుగుతుండడం విశేషం. ఇక తాజాగా జైలర్ సినిమా బెంగుళూర్ లో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు బెంగుళూర్ లో రిలీజ్ డే రోజు kgf2 సినిమాకి అత్యధికంగా 1037 షోలు పడి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా తర్వాత నాన్ లోకల్ మూవీ అవతార్2 కి 1014 షోలతో రికార్డు ఉంది. ఇప్పుడు వీటిని బ్రేక్ చేస్తూ రజినీకాంత్ ఆల్ టైం రికార్డు సెట్ చేసాడు.

ఆగష్టు 10న రిలీజ్ అవుతున్న జైలర్ అక్కడ రిలీజ్ రోజు 1093 షోలతో ప్రదర్షింపబడనుంది. అంటే జైలర్ ఇప్పుడు బెంగుళూరులో అత్యధిక షోలు ప్రదరించే సినిమాగా నిలవనుందన్నమాట. అయితే ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలో నటించడం వల్ల కూడా ఈ రేంజ్ హైప్ బెంగుళూర్ లో దక్కిందని చెప్పొచ్చు. ఇక జైలర్ సినిమా రిలీజ్ రోజు 100కోట్ల కి పైగా వసూలు చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు