Jawan: తెలుగులోనూ గట్టిగానే ఫోకస్ చేసినట్టున్నారే?

Jawan releasing also in telugu

బాలీవుడ్ లో రాబోతున్న క్రేజీ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి “జవాన్“. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ఆయన సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తుండడంతో అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. దానికి తోడు రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కి కూడా ఫుల్ పాజిటివ్ బజ్ వచ్చింది. అయితే ఈ సినిమాకి సంబంధించి సౌత్ పైన కూడా బాగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.

ముఖ్యంగా తెలుగు, తమిళ్ పైనే మేకర్స్ కన్ను పడింది. హిందీలోనే పూర్తిగా తెరకెక్కుతున్నప్పటికీ సినిమాలో పలు సందర్భాల్లో సౌత్ మీల్స్ కూడా ఉంటాయని టాక్ నడుస్తుంది. ఎందుకంటే తీస్తుంది అట్లీ కాబట్టి. ఇక ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ కూడా తమిళ నటులే ఉండడం విశేషం. హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా, ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఇక కీలక పాత్రల్లో ప్రియమణి, యోగిబాబు, అమృత అయ్యర్ తదితర సౌత్ నటులే నటించారు. ఆఖరికి మ్యూజిక్ కూడా తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందిస్తుండడం విశేషం.

ఇక అన్నిటికంటే ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో కూడా సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అయితే తమిళ టెక్నిషియన్స్ ఉన్నారు కాబట్టి తమిళ్ లో రిలీజ్ చేస్తున్నారు అనుకోవచ్చు. మరి తెలుగు వాళ్ళు ఎవరున్నారని ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు అంటే, మార్కెటింగ్ అని చెప్పవచ్చు. గత కొన్నేళ్లుగా తెలుగులో ఏ డబ్బింగ్ సినిమా రిలీజ్ అయినా టాక్ బాగుంటే తెలుగు సినిమాలతో సమంగా భారీ కలెక్షన్లు వస్తున్నాయి. కన్నడ నుండి kgf 2,కాంతారా, చార్లీ, తమిళ్ నుండి విక్రమ్, పొన్నియిన్ సెల్వన్, లేటెస్ట్ గా మలయాళం నుండి రిలీజ్ అయిన 2018 సినిమాలు సంచలన విజయం సాధించాయి.

- Advertisement -

ఇవే కాక హిందీ నుండి రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర యావరేజ్ టాక్ తెచ్చుకున్నా భారీ వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రల్లో ఈ సినిమా 30కోట్ల వరకు గ్రాస్ వసూలు చేయడం విశేషం. అందుకే ఇప్పుడు జవాన్ ని కూడా తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే బ్రహ్మాస్త్ర టైం లో ఆ చిత్ర యూనిట్ మొత్తం టాలీవుడ్ కి వచ్చి ప్రమోట్ చేయడం వల్ల ఇక్కడ అన్ని కలెక్షన్స్ వచ్చాయి. మరి కింగ్ షారుఖ్ ఖాన్ తన స్టార్ డమ్ ని పక్కన పెట్టి ఇక్కడ కూడా ప్రమోషన్లు చేస్తాడా లేదా చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు