Atlee: దుమ్ము లేపిన జవాన్ ప్రివ్యూ.. మళ్ళీ టాప్ కి వెళ్తాడా?

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఎప్పుడో రెండేళ్ల కిందట అనౌన్స్ చేసిన ఈ సినిమా బాలీవుడ్ మోస్ట్ కేజ్రీయెస్ట్ ప్రాజెక్ట్ లలో ఒకటి. ఈ సినిమా అనౌన్స్ చేసినపుడే చాలా మంది షారుఖ్ కెరియర్లో ఒక ప్రత్యేక సినిమా అవుతుందని అన్నారు. అయితే జవాన్ సినిమా నుండి తాజాగా “జవాన్ ప్రివ్యూ” పేరుతో టీజర్ రిలీజ్ అయింది.

విడుదలైన గంట వ్యవధిలోనే ఈ సినిమాకి మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షల కొద్దీ లైక్స్ వచ్చి పడుతున్నాయి. టీజర్ చూసాక ఒక్కమాటలో చెప్పాలంటే ప్రామిసింగ్ గా ఉందని చెప్పవచ్చు. షారుఖ్ ఖాన్ ఎలివేషన్, తన స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీ తో పాటు, అట్లీ టేకింగ్ అద్భుతంగా ఉంది. ఈ టీజర్ కి పెద్ద ప్లస్ పాయింట్ అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఇక ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ ఆర్మీ నుండి బయటకు వచ్చేసిన వ్యక్తిగా మనకు కనిపించాడు. బహుశా సమాజం లో జరిగే పరిస్థితుల ప్రభావం వల్ల అతను బయటికి వచ్చి ఉండవచ్చు. అలా వచ్చిన హీరో విలన్ గా మారితే ఎలా ఉంటుందో జవాన్ ద్వారా ఆడియన్స్ కి చూపించబోతున్నాడు అట్లీ. ఇక టీజర్ చివర్లో షారుఖ్ ఖాన్ గుండు లుక్ లో మాస్ గా కనిపించి షాక్ ఇచ్చాడు. షారుఖ్ ఖాన్ ఇలా తొలిసారిగా కనిపించడం విశేషం.

- Advertisement -

ఇక పఠాన్ ద్వారా పదేళ్ల తర్వాత భారీ కమ్ బ్యాక్ హిట్ కొట్టిన షారుఖ్ ఖాన్, జవాన్ సినిమా ద్వారా అంత కన్నా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి, కోల్పోయిన తన నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుందామని చూస్తున్నాడు.

ఇక ఈ సీనిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, దీపికా పదుకొనె, ప్రియమణి ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక జవాన్ సినిమాను ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారని తెలుస్తుంది. షారుఖ్ భార్య గౌరీ ఖాన్ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక జవాన్ సినిమాను సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు