Rajadeluxe: ప్రభాస్ మారుతి సినిమా దానికంటే ముందే వస్తుందా?

Rajadeluxe releasing before kalki 2898AD?

టాలీవుడ్ లో అందరికంటే ఎక్కువగా పాన్ ఇండియా మూవీస్ తీస్తున్న టాప్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్. ఈ హీరో జయాపజయాలను పక్కనబెడితే బాహుబలి తర్వాత అన్ని పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్నాయి. అందులో సాహో యావరేజ్ గా నిలవగా, రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్స్ అయ్యాయి. ఇక ఇప్పుడు రాబోతున్న “సలార్” పైన మాత్రం ప్రభాస్ సినిమాల్లో బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో హైప్స్ ఉన్నాయి. దీనికితోడు రిలీజ్ అయిన టీజర్ ఆల్ టైం వ్యూస్ తో సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇక నాగ్ అశ్విన్ తో తీస్తున్న కల్కి2898AD గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా రిలీజ్ చేద్దామని చూస్తున్నారు. అయితే వీటితో పాటు మారుతి, సందీప్ రెడ్డి వంగ సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. అయితే సందీప్ రెడ్డి అనిమల్ సినిమా షూట్ లో బిజీ గా ఉన్నాడు. కాబట్టి నెక్స్ట్ మారుతి తినే ప్రభాస్ సినిమా తీస్తాడని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ సినిమా ప్రభాస్ చేస్తున్న సినిమాల మధ్యలో గ్యాప్ లో మారుతి కూడా చేస్తారని టాక్ నడుస్తుంది.

ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మారుతి తో చేస్తున్న సినిమా ఫినిష్ చేస్తారని అంటున్నారు. ఎందుకంటే ఆ సినిమాని సింపుల్ గా ఎంటర్టైన్మెంట్ జోనర్ లో తీస్తున్నారని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాకి రాజా డీలక్స్ అని టైటిల్ కూడా ఫిక్స్ చేసారు. ఇక కేవలం మూడు నెలల్లో ఈ సినిమా పూర్తి చేయాలనీ ప్రభాస్ కండిషన్ పెట్టాడని సమాచారం. అందువల్ల కల్కి మూవీ కి ముందే ఈ సినిమా రిలీజ్ చేయాలనీ మేకర్స్ చూస్తున్నట్టు ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -

ఇక నాగ్ అశ్విన్ కల్కి సినిమా 2024 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమా ఇప్పటివరకు 50శాతమే పూర్తయిందని మిగతా భాగం ఫినిష్ చేయడానికి చాలా రోజులు టైం పడుతుందని అంటున్నారు. అంటే కల్కి సమ్మర్ లో వచ్చే అవకాశం తక్కువ. అందుకే ముందుగా రాజా డీలక్స్ పూర్తి చేసి ఆ తర్వాత కల్కి పై దృష్టి పెడదామని ప్రభాస్ అనుకుంటున్నట్టు సన్నిహితుల సమాచారం. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మారుతి మూవీ మేకర్స్ టీమ్ నుండి క్లారిటీ రావాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు