Salaar: గుర్తుంచుకోండి.. 100రోజులు… అంటున్న ఫ్యాన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా “ఆదిపురుష్”. బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ అవడంతో చాలా తనతో పాటు ఫ్యాన్స్ కూడా చాలా డీలా పడ్డారు. ఆదిపురుష్ ప్లాప్ అవ్వడం కంటే ఆ సినిమాపై వచ్చే నెగిటివ్ విమర్శలు, ప్రభాస్ గెటప్ కి సంబంధించిన ట్రోల్ల్స్ అభిమానులను చాలా బాధపెడుతున్నాయి. రాధే శ్యామ్ డిజాస్టర్ తో ప్రభాస్ ఫ్యాన్స్ బాధ పడ్డా, ఆదిపురుష్ తో ప్రభాస్ భారీ హిట్ కొడతాడని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ ఆ సినిమా అంతకు మించిన ప్లాప్ కావడంతో ప్రభాస్ కంటే ఎక్కువ అభిమానులే బాధపడుతున్నారు.

అయితే అభిమానుల మనసుకు తగిలిన గాయానికి మందులాగా ఈరోజు ఒక అప్డేట్ వచ్చింది. ప్రభాస్ కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలున్న ఈ సినిమా సెప్టెంపెర్ లో విడుదల చేస్తున్నారు. అయితే “సలార్” సినిమా రిలీజ్ అవడానికి ఇంకా 100రోజులు మాత్రమే ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇది చుసిన ఫ్యాన్స్ “సలార్” ఖచ్చితంగా ఈ ఏడాదే వస్తుందని ఫిక్స్ అయ్యిపోయారు.

ముందునుంచే ప్రభాస్ ఫ్యాన్ ఆదిపురుష్ కన్నా సలార్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇతర సినిమాల షూటింగ్ లో బిజీ ఉండడం వల్ల ప్రభాస్ నుంచి ఈ ఏడాది సలార్ సినిమా రావడం కష్టం అని అనుకున్నారు. ఇప్పడు ఈ పోస్టర్ అప్డేట్ తో అభిమానులు సలార్ విధ్వంసం ఈ ఏడాదే ఉండడంతో ట్రోల్ చేసిన వారందరికీ గట్టి స్ట్రోక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఆదిపురుష్ పై, ఆ సినిమా లుక్స్ పై ట్రోల్ల్స్ చేసిన వారందరికీ పెద్ద కౌంటర్ వేసేలా ఉన్నారు. దీనికి తోడు ప్రభాస్ సలార్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా బాహుబలి రేంజ్ లో అదిరిపోయింది. అటు ప్రభాస్ కూడా సలార్ తో దాదాపుగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ కు చుక్కలు చూపించేలానే ఉన్నాడు.

- Advertisement -

మరి ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం సలార్ అనుకున్న డేట్ కి వస్తాడా? హ్యాట్రిక్ పరాజయాల తర్వాత ట్రాక్ లోకి వస్తాడా? అభిమానుల కల నెరవేరుతుందా అన్నది చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు