Leo: కోలీవుడ్‌కు గుడ్ బై: నిన్న విజయ్ నేడు లోకేష్… తమిళ ఇండస్ట్రీలో అసలేం జరుగుతుంది?

తమిళ ఇండస్ట్రీ… భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో తనదైన ముద్ర వేసుకుంటున్న ఇండస్ట్రీ. రజినికాంత్, కమల్ హాసన్ లాంటి అగ్ర హీరోలు చాలా ఎళ్ల నుంచి సినిమాలు చేస్తున్నా.. ఈ మధ్య కాలంలోనే తమిళ ఇండస్ట్రీకి మంచి పేరు వచ్చింది. దీనికి ఒక కారణం, రజిని, కమల్ లాంటి సీనియర్ హీరోలు, యంగ్ హీరోలతో పాటు కొంత మంది డైరెక్టర్లు అని కూడా చెప్పొచ్చు. అలా డైరెక్టర్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని ఒకటి క్రియేట్ చేసి, ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చేస్తున్న లోకేష్ కనగరాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కమల్ హాసన్, విజయ్ తలపతి, విజయ్ సేతుపతి వంటి స్టార్లకు కెరీర్ లోనే బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ లను అందించాడు. ఇప్పటి వరకు ఈయన నుంచి వచ్చిన సినిమాలకే కాదు.. రాబోయే సినిమాలపై కూడా ప్రేక్షకులకు మంచి ఇంట్రెస్ట్ ఉంది. మాస్టర్, ఖైదీ, విక్రమ్ లాంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత లోకేష్ జోరు మరింత పెరిగింది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్.. విజయ్ తలపతితో లియో అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత కమల్ హాసన్, రజినీకాంత్, సూర్యతో సినిమాలున్నాయి.

అద్భతమైన లైనప్ తో ఉన్న లోకేష్ కనగరాజ్ తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన కెరీర్ లో 10 సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పాడు. 10 సినిమాలు అయిన వెంటనే తన కెరీర్ కి రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టు ప్రకటించాడు. హాలీవుడ్ దర్శకుడు క్వింటెన్ టరెంటీనో లా తాను కూడా 10 సినిమాల కంటే ఎక్కువ చేయనని అనౌన్స్ చేశాడు. ఇది ప్రస్తుతం LCU ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తుంది. కాగా, ఇటీవల విజయ్ తలపతి కూడా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచనతో విజయ్ ఉన్నాడని, అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇలా విజయ్, లోకేష్ వరుసగా గుడ్ బై చెప్పడంతో, అసలు కోలీవుడ్ లో ఏం జరుగుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు