Jr NTR: లక్ష్మీ ప్రణతిని కాకుంటే ఎన్టీఆర్ ఆమెనే పెళ్లి చేసుకునేవాడా..?

నందమూరి వంశం నుండి మూడవ తరం హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. అచ్చం తాత చరిష్మాను పుట్టుకతోనే అందిపుచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల పరంగా టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఇక ఫ్యామిలీ పరంగా కూడా ఎన్టీఆర్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. అందుకు మెయిన్ రీజన్ ఆయన భార్య లక్ష్మీ ప్రణతి అనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిలది పెద్దలు కుదిర్చిన వివాహం.

2011వ సంవత్సరం మే 5వ తేదీన వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లి నాటికి లక్ష్మీ ప్రణతి వయసు కేవలం 19 సంవత్సరాలు అయినా.. ఇప్పటికీ అన్యోన్యంగా సంసారం ముందుకు సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ జీవితంలోకి అడుగు పెట్టినప్పటి నుండి ఆయనకు యమ రేంజ్ లో కలిసి వస్తుంది. కెరీర్ మొదట్లో హిట్ల కోసం ఎన్నో తంటాలు పడిన ఎన్టీఆర్.. ఆ తరువాత వరుసగా హైట్రిక్ విజయాలను అందుకొని ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా, గ్లోబల్ స్థాయి హీరోగా ఫేమస్ అయ్యాడు.

అయితే తాజాగా ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల పెళ్లికి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్ష్మీ ప్రణతి చంద్రబాబు నాయుడు గారి బంధువే. ఇలా చుట్టరికం కలుపుకున్నాడు ఎన్టీఆర్. అయితే లక్ష్మీ ప్రణీతి కంటే ముందే ఎన్టీఆర్ ఓ రాజకీయ నేత కూతురిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట. తెలుగుదేశం పార్టీలో ఉండే ఓ టాప్ లీడర్ కూతురితో ఎన్టీఆర్ వివాహం చేయాలని చంద్రబాబు అనుకున్నారట. ఎన్టీఆర్ కి కూడా ఆ అమ్మాయి బాగా నచ్చేసిందట. కానీ ఎన్టీఆర్ తల్లికి మాత్రం ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నచ్చాక రిజెక్ట్ చేసిందట. ఆ తరువాత వచ్చిన లక్ష్మీ ప్రణతి సంబంధానికి ఎన్టీఆర్ తల్లి ఓకే చెప్పడంతో పెళ్లి చేసేసారు. ఒకవేళ ఎన్టీఆర్ తల్లి ఆ మొదటి అమ్మాయిని ఒప్పుకుని ఉంటే లక్ష్మీ ప్రణతి కంటే ముందే ఆ టిడిపి టాప్ లీడర్ కూతురినే ఎన్టీఆర్ వివాహం చేసుకొని ఉండేవాడు. ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు