Megafamily: ఉపాసన డెలివరీకి ముందే లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకుందా..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రామ్ చరణ్ తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఆయన భార్య ఉపాసనకు కొణిదెల మంగళవారం ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఓ ప్రకటనను రిలీజ్ చేశాయి. దీంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

2012లో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్, ఉపాసన పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులుగా మారారు. దీంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఉపాసనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉపాసన అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాపరెడ్డి మనవరాలు అనే సంగతి అందరికీ తెలిసిందే. అపోలో ఆసుపత్రులు ఆమె కంట్రోల్ లోనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పుట్టబోయే బిడ్డ ఎవరో ఉపాసనకు ముందే తెలుసు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఉపాసన బేబీని స్కాన్ తీసుకుని ఉంటుందని.. తనకి జెండర్ ముందే తెలుసని.. ఈ క్రమంలోనే ఊప్సీ – ఆర్సి అంటూ ప్రెగ్నెన్సీ సమయంలో ఇచ్చిన పార్టీకి సంబంధించిన ఫొటోస్ మరోసారి ట్రెండ్ అవుతున్నాయి. ఈ పార్టీలో ఉపాసన బేబీ పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ ని ధరించింది. ఈ కలర్ లేడీస్ కి చాలా ఇష్టమని, పిల్లలకి మరీ ఇష్టం అని.. ఆ కారణంగానే ఈ థీమ్ ని చూస్ చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు