Keedaa Cola: మళ్ళీ ఆనాటి బ్రహ్మానందాన్ని చూడగలమా?

బ్రహ్మానందం.. టాలీవుడ్ ని మూడు తరాలుగా ఏలిన హాస్యబ్రహ్మ. ఆయన ఉంటే నవ్వులకి ఢోకా ఉండదని ప్రేక్షకులు ఫిక్సయిపోతారు. శ్రీనువైట్ల, త్రివిక్రమ్ లాంటి దర్శకులు ఆయన లేకపోతే తమ సినిమాలు ఆడవు అనేవారు. ఒక అరగుండు, ఒక జిలేబి, ఒక లవంగం, గజాల ఇలా పేరేదైనా, పాత్ర ఏదైనా బ్రహ్మీ ఉంటే చాలు ఆ పాత్ర హిట్టే సినిమా హిట్టే. ఒకానొక సమయంలో కేవలం బ్రహ్మానందం వల్ల సూపర్ హిట్ అయిన సినిమాలు అనేకం. మనీ, రేసుగుర్రం, ఢీ, రెడీ ఈ సినిమాలన్నీ బ్రహ్మీ కామెడీ తో హిట్టైన సినిమాలే.

అయితే గత కొన్నేళ్లుగా ఆరోగ్యం సరిగా సహకరించకపోవడంతో సినిమాలకు దూరమయ్యారు బ్రహ్మానందం. దాంతో ఆయన కామెడీని తెలుగు ప్రేక్షకులు చాలా మిస్ అయ్యారు. చివరగా ఖైదీ నెం. 150లో చక్కని కామెడీని పంచిన ఆయన ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా సరైన పాత్ర మాత్రం రాలేదు. అది డైరెక్టర్లకు చేతకాకనో, లేక కొత్త కమెడియన్ల రాక వల్లో తెలీదు గాని, బ్రహ్మీ కామెడి బోర్ కొట్టింది. ఆ తర్వాత క్రమంగా ఆయనకు పాత్రలు రావడం తగ్గాయి. ఇక ఆ తర్వాత ఆరోగ్య సమస్యల వల్ల కొంత కాలం గ్యాప్ ఇచ్చి తిరిగి పంచతంత్రం అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు బ్రహ్మానందం. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు.

ఇక రీసెంట్ గా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన “రంగమార్తాండ” సినిమాలో తన అద్భుత నటనతో మెప్పించి ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించాడు. ఆ సినిమాలో తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన బ్రహ్మీ తాను ఏ పాత్రైనా చేయగలడని నిరూపించాడు.

- Advertisement -

అయితే బ్రహ్మానందం కామెడీ ని మాత్రం ప్రేక్షకులు చాలా మిస్ అయ్యారనేది వాస్తవం. టాలీవుడ్ లో ఎంతమంది కమెడియన్లు వచ్చినా ఆయన స్థానాన్ని భర్తీ చెయ్యలేదు. ఎలాగూ రీ ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మీ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే “బ్రో” సినిమాలో నటించిన ఆయన, ఇప్పుడు తరుణ్ భాస్కర్ తీస్తున్న “కీడా కోలా” సినిమాలో ఒక అద్భుతమైన కామెడీ పాత్రతో ముందుకు వస్తున్నాడు. వరదరాజులు పేరుతో ఉండబోయే ఆ పాత్ర చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని డైరెక్టర్ చెప్పాడు. మరి ఈ సినిమాతో బ్రహ్మానందం తన మునుపటి వైభవాన్ని పొంది తెలుగు చిత్ర సీమ కు తన హాస్యంతో అలరిస్తాడా? మునుపటి బ్రహ్మీలా మనల్ని నవ్విస్తాడా? అనేది చూడాలి.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు