Dil raju : బలగం వేణు నెక్స్ట్ సినిమాకి ఆ సీనియర్ హీరో ఆసక్తి చూపిస్తున్నాడా ?

పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా నటించిన వేణు ఎల్దండి నటుడిగా చాలా పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయస్తుడే. ఎన్నో సినిమాలు, మరెన్నో పాత్రల ద్వారా ప్రేక్షకులని అలరించిన వేణు ఇటీవలనే దర్శకుడిగా మారి అందరిని ఆశ్చర్య పరిచాడు.

ప్రియదర్శి హీరోగా, కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా వేణు ఎల్దండి దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా గత మార్చి3 న థియేటర్స్ లో రిలీజై, బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. తెలంగాణ పల్లెటూరి బంధాలను, బాంధవ్యాలను గుర్తు చేస్తూ వచ్చిన ఈ బలగం సినిమా ఈ ఏడాది వచ్చిన ఉత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

కొన్ని సినిమాలకు పేరు వస్తే, మరికొన్ని సినిమాలకు పేరు రాకపోయినా డబ్బు వస్తుంది. కానీ అతికొద్ది సినిమాలు మాత్రమే డబ్బు, పేరు రెండు తెచ్చి పెడతాయి. బలగం సినిమా కూడా ఈ కోవకి చెందిన సినిమానే. కేవలం మూడు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 30 కోట్ల వసూళ్ళని రాబట్టి ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతే కాదు ఇందులో నటించిన ప్రతి ఆర్టిస్ట్ కి చాలా పేరు తీసుకొచ్చింది. ఇక డైరెక్టర్ వేణు ఎల్దండికి సన్మానాలు, సత్కారాలతో పాటు విలక్షణ దర్శకుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు తీసుకొచ్చింది.

- Advertisement -

అయితే వేణు ఎల్దండి బలగం సినిమా హిట్ తరువాత ఏ సినిమా చేయబోతున్నాడని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొద్దిరోజుల క్రితం వరకు సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేసిన వేణు. తన నెక్స్ట్ సినిమా పనులు మొదలు పెట్టినట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఈ సినిమా కూడా దిల్ రాజు ప్రొడక్షన్ లోనే ఉండబోతుందని వార్త. అయితే నటీనటులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఒక సీనియర్ స్టార్ హీరో మాత్రం వేణు ఎల్దండి తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు