Captain Miller: ఈ మిడ్ నైట్ టైమింగ్ లేంటి గురూ?

“Captain Miller” teaser is being released at midnight?

సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడు మరో నయా ట్రెండ్ మొదలైంది. ఏ సినిమాకైనా ఆడియన్స్ లో ఒక మంచి హైప్ రావాలంటే, దానికి టీజర్, లేదా ట్రైలర్ల ద్వారా మాత్రమే సాధ్యం. ముఖ్యంగా పెద్ద సినిమాలకి ఇవే కీలకం. మాములుగా ఒక సినిమా టీజర్ ని, గాని, ట్రైలర్ ని గాని రిలీజ్ చేయాలనుకున్నప్పుడు మూవీ మేకర్స్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల మధ్యలోనే రిలీజ్ చేస్తారు. ఒకవేళ టెక్నికల్ లోపాల వల్ల లేట్ అయితే 8 లేదా 9 గంటలకు టీజర్స్ వస్తాయి.

కానీ ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలైంది. టాలీవుడ్ లోనే మొదలైన ఈ ట్రెండ్ కోలీవుడ్ కి కూడా పాకింది. రీసెంట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “సలార్” గ్లిమ్ప్స్ పొద్దు పొద్దున్నే 5.12 నిమిషాలకి రిలీజ్ చేయడం జరిగింది. దీనికోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ లో కూడా భారీ క్రేజ్ ఉండడం వల్ల అంత పొద్దున రిలీజ్ చేసినా టీజర్ ట్రెండ్ అయ్యి, పలు రికార్డులను నమోదు చేసింది.

దీనికి కొనసాగింపుగా ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా “కల్కి2898AD” టీజర్ కూడా తెల్లవారు జామున 2గంటలకి రిలీజ్ చేయడం జరిగింది. ఇండియాలో ఆ టైమ్ కి చాలా తక్కువ మంది జనాలే ఆక్టివ్ గా ఉంటారు. అందుకే టీజర్ కి మంచి వ్యూస్ వచ్చినా ఎక్కువ ట్రెండ్ కాలేదు.

- Advertisement -

ఇక ఇప్పుడు తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న కొత్త సినిమా “కెప్టెన్ మిల్లర్” టీజర్ రిలీజ్ డేట్ తో పాటు టైమ్ ప్రకటించారు. ఈ సినిమా టీజర్ ని అర్ధరాత్రి 12.01 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించడం జరిగింది. ఇంకా సలార్, కల్కి టీజర్స్ ఎర్లీ మార్నింగ్ అయినా వచ్చాయి. కానీ కెప్టెన్ మిల్లర్ టీజర్ ఏకంగా మిడ్ నైట్ లో రిలీజ్ చేయడమేంటనీ సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. మరి కొందరైతే దయ్యాలు తిరిగే టైమ్ లో టీజర్ల రిలీజ్ ఏంటని ఫన్నీ మీమ్స్ వేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు