Baby Movie: ఆ కోలీవుడ్ డైరెక్టర్ కు నచ్చిన బేబీ

 Kollywood star director appreciates baby team

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన బేబీ సినిమా జులై 14న విడుదలైన విషయం తెలిసిందే. సాంగ్స్ తో, పోస్టర్స్ తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ తరువాత మీడియం రేంజ్ సినిమాలలో సంచలనంగా నిలిచింది. రోజు, రోజులు కలెక్షన్స్ పెరుగుతూ ఇప్పటికే 70 కోట్ల వసూళ్ళని దాటినా ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

అయితే బేబీ సినిమా కేవలం కలెక్షన్స్ లో మాత్రమే కాదు. పలు సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటుంది. ఇటీవలనే బేబీ సినిమాపై డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బేబీ సినిమాని పొగుడుతూ మూవీ టీం తమ బెస్ట్ విషెష్ తెలియజేయగా ప్రస్తుతం ఒక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కూడా బేబీ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

ఆ డైరెక్టర్ మరెవరో కాదు విగ్నేష్ శివన్. తమిళ్ లో పలు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఈ యంగ్ డైరెక్టర్ ననూమ్ రౌడీ దాన్ ( తెలుగులో నేను రౌడీనే ) చిత్రానికి బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు కూడా తీసుకున్నారు.ఇక ఆ సినిమాలో హీరోయిన్ గా చేసిన నయనతారనే విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.

- Advertisement -

అయితే ఇటీవలనే బేబీ సినిమా చుసిన ఈ దర్శకుడు తన ఇంస్టాగ్రామ్ లో బేబి 10 రోజుల వసూళ్ళ పోస్టర్ తో కమింగ్ ఏజ్ కాంబినేషన్ బోల్డ్ గా తెరకెక్కించిన బేబీ సినిమా తనకెంతగానో నచ్చిందని.. టీం అందరికి గ్రాండ్ సక్సెస్ కి కంగ్రాట్స్ చెబుతూ సినిమాలో డైలాగ్స్ తనకు బాగా నచ్చాయంటూ చెప్పుకోచ్చాడు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు