PSPK: అప్పుడే హాఫ్ మిలియన్ కొట్టేసిందా “బ్రో”?

Bro advance bookings:

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అవుతున్న క్రేజీ సినిమా “బ్రో“. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా రీమేక్ కావడం వల్ల మొదట్లో అంచనాలు పెద్దగా లేవు. పైగా పవన్ కళ్యాణ్ హీరోగా కాకుండా ప్రత్యేక పాత్రలో మాత్రమే నటిస్తున్నాడంటూ వార్తలు రావడంతో మెగా ఫ్యాన్స్ సైతం ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యిందో అప్పట్నుంచి పీకే ఫ్యాన్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచుకుంటూ వస్తున్నారు.

ఇక తాజాగా బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా జరిగింది. మెగా జూనియర్ హీరోలు కూడా ఈ ఈవెంట్ కి హాజరై తమ విషెస్ తెలియచేసారు. ఇక బ్రో సినిమా బిజినెస్ 97 కోట్ల వరకు జరగగా, దాదాపు 100కోట్ల టార్గెట్ తో రిలీజ్ అవుతుంది “బ్రో”. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు ఊపందుకుందుకుంది. అటు ఓవర్సీస్ లోను లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ అవుతున్న “బ్రో” ఉన్న తక్కువ థియేటర్లలోనే అడ్వాన్స్ బుకింగ్స్ లలో జోరు చూపిస్తుంది.

ఇప్పటికే అడ్వాన్సు బుకింగ్స్ తో 4న్నర లక్షల డాలర్లను వసూలు చేసిన “బ్రో” మరి కొన్ని గంటల్లో హాఫ్ మిలియన్ మార్క్ ని దాటడం ఖాయం. ఇక ఇంతకు ముందు పలు హాలీవుడ్ బడా మూవీస్ రిలీజ్ వలన తక్కువ స్క్రీన్సే ఇచ్చినా, ఇప్పుడు బ్రో డిమాండ్ చూసి స్క్రీన్ లు పెంచే ఆలోచనలో ఉన్నారట అక్కడి డిస్ట్రిబ్యూటర్లు. మరి పవర్ స్టార్ సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది. మరి జులై28 న రిలీజ్ అవుతున్న “బ్రో” ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు