Avinash: నా మొహం మీదే అలా అనడంతో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. అవినాష్ ఎమోషనల్ కామెంట్స్..!

Avinash: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలా అయిన వారిలో ముక్కు అవినాష్ కూడా ఒకరు. ఈయన మొదట జబర్దస్త్ షోలో పలు స్కిట్స్ చేసి జనాలను విపరీతంగా నవ్వించారు. ఇక అనంతరం పలుషోస్ చేసి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస షోస్ చేస్తూ స్టార్ కమెడియన్గా ఎదిగాడు.

ఇక ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవినాష్ తన జీవితంలో ఎదురైనా కొన్ని చేదు అనుభవాల గురించి వెల్లడించాడు. ” జబర్దస్త్ లో ఫామ్ ‌ లో ఉండగానే నేను ఇల్లు కట్టుకున్నాను. అయితే సేవ్ చేసిన డబ్బులు అన్ని దానికి పెట్టాల్సి వచ్చింది. అప్పుడే కరోనా రావడంతో లాక్ డౌన్ పడి అప్పులు చేయాల్సి వచ్చింది. ఇక అప్పుడు వడ్డీలు కూడా పెరిగాయి. పని లేకపోవడంతో కట్టలేకపోయాను. దీంతో అప్పులు చేసిన వాళ్లు నన్ను ఒత్తిడి చేశారు.

avinashs-emotional-comments
avinashs-emotional-comments

నేను జబర్దస్త్ షోలో చేసినప్పుడు నా కామెడీ బాగుందని చెప్పిన వాళ్ళు నా మొహం మీద తిట్టారు. దాంతో మానసికంగా నేను కృంగిపోయాను. ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నాను. నా జీవితంలో ఆకలి బాధలు ఉన్నాయి. కానీ అప్పుల బాధలు లేవు. ఇల్లు కట్టినప్పుడు అవి మొదటిసారిగా ఎదురయ్యాయి ” అంటూ చెప్పుకొచ్చాడు అవినాష్. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు