Samantha Kushi Movie: సామ్ బ్రేక్‌కి బ్రేక్ ఇవ్వాల్సిందే.. తప్పదు?

Samantha Kushi Movie

టాప్ యాక్టరస్ సమంత ఖుషి మూవీతో పాటు సిటాడెల్ అనే వెబ్ సిరీస్ షూటింగ్స్ ను పూర్తి చేసుకుని 6 నెలలు రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. సామ్ మెంటల్‌గా, హెల్త్ పరంగా స్ట్రాంగ్ అవ్వడానికి ఈ బ్రేక్ తీసుకుంటుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ప్రొడ్యూసర్ల నుంచి తీసుకున్న అడ్వాన్స్ ను కూడా రిటర్న్ చేసేసింది.

ఇలా అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేయడంతో సామ్ ఈ సిక్స్ మంత్స్ బ్రేక్ ని ఫుల్‌గా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిందని అర్థమవుతుంది. కానీ ఈ బ్రేక్ ఎక్కువ రోజులు ఉండేలా లేదు. ఎందుకంటే, సమంత ఖుషి మూవీ, సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లను పూర్తి చేసింది. ఖుషి మూవీ సెప్టెంబర్ 1న విడుదల కానుండగా, సిటాడెల్ కూడా త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. దీంతో వీటి ప్రమోషన్స్ కోసం సామ్ బయటికి రావాల్సిందే.

ఖుషి మూవీకి అయినా, సిటాడెల్ వెబ్ సిరీస్ కు సమంత తీసుకున్న రెమ్యునరేషన్ పాలసీల్లో భాగంగా మూవీ ప్రమోషన్స్‌లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. దీంతో ఈ కండీషన్స్ వల్ల ఫుల్ ఎంజాయ్ మూడ్‌లో ఉన్న సామ్ బయటికి రాక తప్పదు.

- Advertisement -

సిటాడెల్, ఖుషి (Kushi) షూటింగ్స్ పూర్తి చేసుకున్న తర్వాత సామ్ ముందుగా తన టైంని ఈష ఫౌండేషన్ లో గడిపింది. అక్కడ యోగా చేస్తు ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాల్లో షేర్ చేసింది. అక్కడి నుంచి ఇండోనేషియాలోని బాలికి వెళ్లిపోయింది. నేచర్ ను ఎంజాయ్ చేస్తూంది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తన ఇన్‌స్టాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. అలాగే ఇటీవల ఒక స్టోరీ పెట్టింది. దీనిలో 4 డిగ్రీ సెల్సీయస్ వద్ద ఉన్న ఐస్ వాటర్ లో 6 మినిట్స్ ఉండి ఓ ఛాలేంజ్ చేసింది.

దీంతో పాటు తన ఫిట్ నెస్ పైన కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది. అటు నేచర్ ను ఎంజాయ్ చేస్తూనే, ఇటు ఎక్కువ టైంని జిమ్ లో గడిపేస్తుంది. ఇలా బ్రేక్ ను ఎంజాయ్ చేస్తున్న సామ్… కొద్ది రోజుల్లోనే ప్రమోషన్స్ పేరుతో బయటికి రాక తప్పదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు