Bro PreRelease Event: పవన్ కామెంట్స్ కి ఉలిక్కిపడ్డ కోలీవుడ్ – కౌంటర్ ఇచ్చిన నాజర్..!

Bro PreRelease Event

ఇటీవల జరిగిన బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కోలీవుడ్ ఇండస్ట్రీ గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఇష్యూ మొదలై చాలా కాలం అవుతున్నా కూడా టాలీవుడ్ నుండి ఏ ఒక్కరు నోరు మెదపలేదు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వటంతో ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది.

కళారంగానికి బాష, ప్రాంతం అనే హద్దులు ఉండకూడదని కలిసి పని చేసి ఎదగాలంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కి కోలీవుడ్ నటుడు, నడిగర్ సంఘం ప్రెసిడెంట్  నాజర్ కౌంటర్ ఇచ్చాడు. క్లొఇవుడ్ ఇండస్ట్రీ టాలెంట్ తొక్కేసే విధంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కొంతమంది తమ నిర్ణయాన్ని వక్రీకరిస్తున్నారని అన్నాడు.

తమిళ నాడుకి చెందిన సినీ కార్మికుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, నటులు టెక్నీషియన్లకి ఆ రూల్స్ వర్తించవని అన్నారు. ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా ఎరాలో పక్క ఇండస్ట్రీ ఆర్టిస్ట్స్ ని నియంత్రించాలని అనుకోవటం అంత మూర్ఖత్వం ఉండదని అన్నాడు.

- Advertisement -

పక్క ఇండస్ట్రీ ఆర్టిస్ట్స్ లను ఎంకరేజ్ చేసే సంస్కృతి ఎప్పటి నుండో ఉందని, ఎస్వీ రంగారావు, సావిత్రి వంటి నటులు తమిళ్ లో చాలా సినిమాలు చేసారని అన్నారు. సినీకార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాన్ని ఇలా వక్రీకరించి చేసే వ్యాఖ్యలను నమ్మొద్దని అన్నారు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్నే రేపాయని చెప్పాలి. పవన్ కామెంట్స్ పట్ల కోలీవుడ్లో నెగిటివిటీ ఏర్పడిందని అనటానికి నాజర్ రియాక్షన్ ఉదాహరణగా చెప్పవచ్చు. అసలే టాలీవుడ్ నుండి పాన్ ఇండియా సినిమాలు వస్తూ ప్రపంచ స్థాయిలో రికగ్నిషన్ పొందుతున్న సమయంలో కోలీవుడ్ నుండి వచ్చిన ప్రెస్టీజియస్ మూవీ పొన్నియన్ సెల్వన్ ఆశించిన స్థాయిలో ఆడలేదన్న నిరాశలో ఉన్న కోలీవుడ్ వర్గాల్లో పవన్ కామెంట్స్ మరింత అసహనాన్ని పెంచాయి. మరి, ప్రాంతీయ అభిమానం కోసం ఎంతవరకైనా వెళ్లే స్వభావం ఉన్న తమిళ తంబీలు ఇంకెలాంటి డెషిషన్స్ తీసుకుంటారో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు