Samantha: సినిమాలకు బాయ్ – బాలిలో ఎంజాయ్..!

Samantha In Bali

లేడీ సూపర్ స్టార్ సమంత ( Samantha ) సినిమాలకు 6 months గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హెల్త్ ఇష్యూస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సామ్ ఇప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి బాలిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ట్రిప్ కి వెళ్లినప్పటి నుండి రోజూ ఇంస్టాగ్రామ్ లో సమంత అప్లోడ్ చేస్తున్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా సమంత అప్లోడ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నాలుగు డిగ్రీల చలిలో సమంత ఐస్ బాత్ చేసిన వీడియో తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అది నెటిజన్స్ అటెన్షన్ ని గ్రాబ్ చేస్తోంది. ఎముకలు కొరికే నాలుగు డిగ్రీల చలిలో సమంత ఆరు నిమిషాల పాటు ఐస్ బాత్ చేయటం ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేసింది.

ఒక పక్క మాయోసైటిస్ తో ఫైట్ చేస్తూ మరొక పక్క వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడిపిన సమంత తనపై వచ్చిన ట్రోల్స్ కి ఎప్పటికప్పుడు తనదైన స్టైల్ లో స్ట్రాంగ్ గా కౌంటర్స్ ఇస్తూ ఫిజికల్ గా, మెంటల్ గా ఒక మినీ సైజ్ యుద్ధమే చేసిందని చెప్పాలి. సమంత విజయ్ దేవరకొండతో కలిసి యాక్ట్ చేసిన ఖుషి మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ ఖుషి సాంగ్స్ రెండు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకోగా సినిమాఫై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. సమంత, విజయ్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వటం ఖుషి సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

సమంత యాక్ట్ చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ తో కలిసి బోల్డ్ సీన్స్ లో నటించిందని టాక్ ఉండటంతో  సిటాడెల్ కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సిటాడెల్ ఇంగ్లీష్ వర్షన్లో ప్రియాంక చోప్రా హీట్ ఎక్కించే బోల్డ్ సీన్స్ వైరల్ అవ్వటంతో ఇండియన్ వర్షన్ సమంత కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుందా అన్న ఎక్సయిట్ మెంట్ ఎక్కువయ్యింది నెటిజన్స్ లో. మరి, 6 months గ్యాప్ తర్వాత సమంత బాలీవుడ్ కే పరిమితం అవుతుందా లేక టాలీవుడ్ లో కూడా మూవీస్ కంటిన్యూ చేస్తుందా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు