Bholaa Shankar Trailer: భోళా శంకర్ ట్రైలర్ టాక్ – ఎంటర్టైన్ కాదు నీరసం తెప్పించింది..!

Bholaa Shankar Trailer

ఆడియెన్స్ ఈగర్ గా వైట్ చేస్తున్న భోళాశంకర్ ట్రైలర్ రానే వచ్చింది. ఔట్ అండ్ ఔట్ మాస్, యాక్షన్ సీక్వెన్స్ తో నిండిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఎలివేషన్స్ సీన్స్ లో మెహర్ రమేష్ టేకింగ్ మహతి స్వరసాగర్ ఇచ్చిన బీజీఎమ్ పెద్ద ప్లస్ పాయింట్ అయ్యేలా ఉంది. యాక్షన్ సీన్స్ తో పాటు చిరు మార్క్ కామెడీ టైమింగ్ కూడా ట్రైలర్ లో ఆకట్టుకుంటోంది. ట్రైలర్ చివర్లో చిరు పవన్ ని ఇమిటేట్ చేయటం హైలైట్ అని చెప్పాలి. అంతే కాకుండా శ్రీముఖి సీన్, మురళీశర్మ సీన్స్ మంచి ఫన్ జెనరేట్ చేసాయి. ఆగస్టు 11న రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమాపై అంచనాలను ట్రైలర్ అమాంతం పెంచేసింది.

తమిళ సినిమా వేదాళం కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకి మొదటి నుండి పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. మెహర్ రమేష్ లాంటి డిజాస్టర్ డైరెక్టర్ కావడం, రొటీన్ మాస్ మసాలా సినిమాకి రీమేక్ కావటంతో సినిమాపై మెగా ఫ్యాన్స్ లో కూడా పెద్దగా ఆసక్తి లేదు. ఇప్పటికే రిలీజ్ అయిన  భోళా మేనియా సాంగ్, టీజర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే, ఇటీవల రిలీజ్ అయిన జామ్ జామ్ జజ్జనక, మిల్కి బ్యూటీ సాంగ్స్ సినిమాపై ఇంట్రస్ట్ క్రియేట్ చేయగా ఇప్పుడు ట్రైలర్ అంచనాలను పెంచేసింది.

ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ ఈ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. లుక్స్ పరంగా యంగ్ హీరోస్ కి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్న చిరు ఈ సినిమాలో తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పటం విశేషం.ఇదిలా ఉండగా ట్రైలర్ ఏ మాత్రం ఆకట్టుకోలేదని రొటీన్ మాస్ మసాలా అన్న ఫీల్ వస్తోందని, ఎంటర్టైన్ కాదు కదా నీరసం తెప్పించేలా ఉందని కొంత మంది కామెంట్ చేస్తున్నారు. మరి, మెహర్ రమేష్ పై చిరు పెట్టుకున్న నమ్మకాన్ని భోళాశంకర్ సినిమా నిజం చేస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు