Pawan Kalyan’s Bro: సునీల్ వల్లే బ్రో సినిమా..!

Pawan Kalyan’s Bro

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా జులై 28న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కి సిద్ధంగా ఉన్న క్రమంలో ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బ్రో సినిమా కార్యరూపం దాల్చటానికి సునీల్ ప్రధాన పాత్ర పోషించాడని టాక్ వినిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే, సముద్రఖని డైరెక్షన్లో సునీల్ శంభో శివ శంభో సినిమాలో నటించే సమయంలో అతని టైమ్ మేనేజ్మెంట్ గురించి త్రివిక్రంకి తరచూ చెప్పేవాడని, అప్పటి నుండి త్రివిక్రమ్ సముద్రఖని వర్క్ అని ఫాలో అవుతూ వచ్చాడట. ఆ తర్వాత అలవైకుఠపురం సినిమాలో సముద్రఖని నటించడం ఆ సినిమా షూటింగ్ సమయంలో త్రివిక్రమ్ కి సముద్రఖని కి మధ్య జరిగిన డిస్కషన్స్ లో బ్రో సినిమా కథ గురించి ప్రస్తావన వచ్చిందట.

బ్రో సినిమా కథ విని ఇంప్రెస్ అయిన గురూజీ కొన్ని కీలక మార్పులు చేసి వెంటనే పవన్ కళ్యాణ్ కి వినిపించారట. ఆ తర్వాత ఆలస్యం లేకుండా సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వటం, చకచకా పూర్తయ్యి రిలీజ్ కి రెడీ అవ్వటం జరిగిపోయాయి. సముద్రఖని ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టే పవన్ కళ్యాణ్ కేవలం 21రోజుల డేట్స్ ఇచ్చినప్పటికీ సినిమాలో 90నిమిషాల దాకా స్క్రీన్ ప్రెజెన్స్ ఉండేలా మేనేజ్ చేయగలిగాడని అంటున్నారు.

- Advertisement -

ఆ రకంగా ఈ సినిమాతో ఏ సంబంధం లేకపోయినా కూడా సునీల్ కీలక పాత్ర పోషించాడు. రీమేక్ కావటంతో మొదట పెద్దగా అంచనాలు లేని ఈ సినిమాపై ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆసక్తి పెరిగింది. విరూపాక్ష సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్న తేజ్ సినిమా కావటం, మొదటిసారి మామ అల్లుళ్ళు కలిసి నటించిన సినిమా కావటంతో ఏర్పడ్డ అంచనాలను బ్రో సినిమా అందుకుంటుందా లేదా చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు