Janhvi Kapoor: ధోనిపై ఎన్టీఆర్ బ్యూటీ హాట్ కామెంట్స్..అలా చేస్తానంటూ!

Janhvi Kapoor: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది వారసత్వాన్ని అందుకు ఉంచుకొని ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటే… మరికొంతమంది సొంత కాళ్లపై నిలదొక్కుకొని సక్సెస్ అవుతున్నారు. అయితే వారసత్వాన్ని అందుపుచ్చుకొని ఇండస్ట్రీలో అడపాదప సినిమాలతో రాణిస్తున్న వారిలో.. బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ ఒకరైన సంగతి తెలిసిందే. హీరోయిన్ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మంచి హైట్, బరువైన అందాలు, ఫిట్ గా ఉండే హీరోయిన్లలో జాన్వి ఒకరు. ఈ బాలీవుడ్ అమ్మడు జాన్వి కపూర్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో కంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. వద్దన్నా కూడా సినిమా అవకాశాలు టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈ బ్యూటీకి ఇస్తున్నారు. అలనాటి సీనియర్ హీరోయిన్ శ్రీదేవి కూతురుగా… బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్… ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. శ్రీదేవి పేరు చెప్పుకొని మాత్రమే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ… ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా ఈ బ్యూటీ ని పట్టించుకోకపోయినా…. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు ఇస్తున్నారు. సాధారణంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతర భాషల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఎక్స్పోజింగ్, రొమాంటిక్ సీన్స్ చేయడంలో బాలీవుడ్ భామలు ముందు వరసలో ఉంటారు. అందుకే జాన్వి కపూర్ కూడా వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న దేవర సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్గా నటిస్తోంది.

- Advertisement -

ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో కూడా ఈ బ్యూటీ కనిపింది చేయనుంది. అయితే ఇదంతా పక్కకు పెడితే… తాజాగా హీరోయిన్ జాన్వి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందులోనూ మహేంద్ర సింగ్ ధోనీ లాంటి పెద్ద క్రికెటర్ గురించి మాట్లాడటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇటీవల ఐపీఎల్ మ్యాచ్లో కనిపించిన ఈ బ్యూటీ… సిక్స్ నెంబర్ జెర్సీతో మెరిసింది. మహేంద్రసింగ్ ధోని జెర్సీ నెంబర్ 7… కాబట్టి నేను ఆ నెంబర్ ధరించలేను అని ఈ సందర్భంగా పేర్కొంది జాన్వి కపూర్. ఆ జెర్సీ కేవలం మహేందర్ సింగ్ ధోని కోసం ఉంటుందని… అలాంటి గొప్ప వ్యక్తి జెర్సీ ధరించే హక్కు తనకు లేదని తెలిపింది. దీంతో జాన్వి కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

అలాగే తన పెళ్లి గురించి, కాబోయే భర్త గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన కలలను అతడి కలలుగా భావించేవాడినే పెళ్లి చేసు కుంటానని స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ తెలిపారు. “నాకు ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇచ్చేవాడు. నన్ను ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవాడు. నేను బాధలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవాడు. అన్ని విషయాల్లో నాకు అండగా నిలి చేవాడు. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తే నాకు కావాలి” అని ఆమె చెప్పారు. janhvi kapoor comments on ms dhoni

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు